MoviesTollywood news in telugu

మాస్ మహారాజ్ రవితేజ చేసిన రీమేక్ మూవీస్ ఎన్ని ఉన్నాయో…?

Ravi Teja Remake Movies : మాస్ మహారాజ్ రవితేజ ఎన్నో హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అయితే ఇందులో కొన్ని రీమేక్ మూవీస్ ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే, మీనా హీరోయిన్ గా నటించిన అమ్మాయికోసం మూవీలో నలుగురు ఫ్రెండ్స్ లో ఒకడిగా రవితేజ నటించాడు. ఇది తమిళ మూవీ తుళ్ళి తురాంతకాలం కి రీమేక్. తమిళంలో ఖుష్భు చేసిన పాత్రను తెలుగులో మీనా చేసింది.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2000లో వచ్చిన తిరుమల తిరుపతి వేంకటేశ మూవీలో రవితేజ, శ్రీకాంత్, బ్రహ్మానందం నటించారు. ఇది తమిళంలో వచ్చిన తిరుపతి తిరుమల వెంకటేసై మూవీకి రీమేక్. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆడియన్స్ ఆదరణ చూరగొంది.

ఇక పుటంపుడు పయనం మూవీకి రీమేక్ గా వచ్చిన చిరంజీవులు మూవీలో నలుగురు ఫ్రెండ్స్ లో ఒకరిగా రవితేజ నటించాడు. 2001లో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. కన్నడలో వచ్చిన అప్పు సినిమాను డైరెక్ట్ చేసిన పూరి జగన్నాధ్ తెలుగులో ఇడియట్ పేరిట రీమేక్ చేయగా, 2002లో రిలీజై, బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మలయాళంలో వచ్చిన మీసమాధవన్ మూవీకి రీమేక్ గా తెలుగులో వచ్చిన దొంగోడు మూవీలో రవితేజ నటించాడు. 2003లో వచ్చిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. తమిళ మూవీ ఆటోగ్రాఫ్ కి రీమేక్ గా రవితేజ హీరోగా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మూవీ తెలుగులో రిలీజయింది. కీరవాణి సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా మాత్రం ఏవరేజ్ అయింది.

విక్రమ్ నటించిన తమిళ మూవీ భూల్ సినిమాకు రీమేక్ గా రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో తెలుగులో వచ్చిన వీడే మూవీలో రవితేజ నటించాడు. 2003లో వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. 2010లో సముద్రగని డైరెక్షన్ లో వచ్చిన శంభో శివ శంభో మూవీ ఎబో ఏవరేజ్ అయింది. ఇది తమిళ మూవీ నాగుడిగళ్ మూవీకి రీమేక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."