MoviesTollywood news in telugu

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్లు ఇప్పుడు ఏమి చేస్తున్నారో…?

Tollywood senior heroines : ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఏలేసిన వాళ్లకు ఇప్పుడు ఛాన్స్ లు రావడం లేదు. హీరోల కైతే 60ప్లస్ వచ్చినా, వాళ్ళ వారసులు ఎంట్రీ ఇచ్చినా సరే, ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చాటుతుంటే, హీరోయిన్స్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోంది. టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, మీనా లాంటి వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం దుమ్మురేపుతున్నారు.

అయితే కాజల్ అగర్వాల్, త్రిష, శ్రేయ, తమన్నా వంటి వాళ్ళ క్రేజ్ క్రమేపి తగ్గిపోతోంది. ఛాన్స్ లు కూడా పెద్దగా రావడం లేదు. పైగా స్పెషల్ సాంగ్స్ లో అయితే ఛాన్స్ లు ఇస్తున్నారు. బాలీవుడ్ లో అయితే మాధురి దీక్షిత్, రవీనా టాండన్, శిల్పాశెట్టి, వంటివాళ్ళు రియాల్టీ షోస్ లో కన్పిస్తున్నారు. ఇక రాణి ముఖర్జీ, సుస్మితా సేన్ లాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తున్నారు.

అయితే ఐశ్వర్య రాయ్, కరిష్మా కపూర్, జూహ్లీ చావ్లా లాంటి వాళ్ళు 90వ దశకంలో దుమ్మురేపి ఇప్పుడు ఛాన్స్ లు రాక అలాగే మిగిలి పోతున్నారు. అయితే దీపికా పదుకునే, కత్రినా కైఫ్, కరీనా కపూర్ వంటి వాళ్ళు 40ఏళ్లకు చేరువవుతున్నా స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. మొత్తం మీద 40దాటితే హీరోయిన్స్ కి ఛాన్స్ లు రావడం లేదని తేలింది.