MoviesTollywood news in telugu

శివయ్య మూవీకి పోటీ ఇచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?

Sivayya Movie : యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా వచ్చిన శివయ్య సినిమా సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ నటి మోనికా బేడీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 1998 మార్చి 27న వచ్చింది. మూవీ మొఘల్ డాక్టర్ డి రామా నాయుడు ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా నిర్మించిన ఈ సినిమాను డైరెక్టర్ సురేష్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడు.

ఎం ఎం శ్రీలేఖ మంచి మ్యూజిక్ అందించింది. సంఘవి కూడా నటించిన ఈ మూవీ పలు కేంద్రాల్లో 100డేస్ ఆడి సూపర్ హిట్ గా నిల్చింది.ఇక అదేరోజు రాజేంద్రప్రసాద్ నటించిన ఆల్ రౌండర్ మూవీ రిలీజయింది. టి ప్రభాకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. మార్చి 14న వన్ మ్యాన్ ఆర్మీ మూవీ రిలీజయింది. సుమన్ నటించిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు.

శివయ్యకు వారం ముందు మార్చి 20న రిలీజైన మావిడాకులు మూవీ లో జగపతి బాబు రచన నటించారు. ఈ సినిమాను ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించగా ఏవరేజ్ గా నిలిచింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ వారెవ్వా మొగుడా మూవీ కథ, కధనం ఆకట్టుకోక పోవడంతో తేడా కొట్టింది. కె రంగారావు డైరెక్ట్ చేసాడు.

ఏప్రియల్ 4న శ్రీకాంత్ నటించిన నిధి మూవీ రిలీజయింది. ఎస్వీ ఎస్ ప్రసాద్ తెరకెక్కించిన ఈ మూవీ నిరాశ పరిచింది. శివయ్య తర్వాత 13రోజులకు మెగాస్టార్ చిరంజీవి, రంభ నటించిన బావగారు బాగున్నారా మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. మణిశర్మ సంగీతం అలరించింది. నటుడు శ్రీహరి ఇందులోనూ శివయ్య మూవీలోనూ మంచి నటన కనబరిచాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."