MoviesTollywood news in telugu

ఈ నటుడి భార్య ఒకప్పటి టాప్ హీరోయిన్…ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

malayalam actor jayaram :జయరాం ఎవరని అనుకుంటున్నారా .. అలవైకుంఠపురం లో మూవీలో నటించి మెప్పించిన ఆర్టిస్ట్ జయరాం. మలయాళ సినిమా పరిశ్రమలో ఈయనంటే తెలియని వారుండరు. మిమిక్రి ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న యితడు అపరం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. భాగమతి, అలవైకుంఠపురంలో మూవీస్ ద్వారా తెలుగులో కూడా అలరించారు.

ఇక క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే సినిమాలో కూడా జయరాం కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఇక ఇతడి భార్య పార్వతి కూడా ఒకప్పటి హీరోయిన్. మలయాళంలో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. సుమారు 70సినిమాల్లో చేసిన ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పేరు సంపాదించుకుంది.

1992లో వీరిద్దరూ లవ్ మేరేజ్ చేసుకున్నారు. వీరికి కొడుకు కాళిదాస్, కూతురు మాళవిక ఉన్నారు. కాళిదాస్ బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో చేసి , ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కాగా 200సినిమాల్లో నటించిన జయరాం కి కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దాదాపు 4దశాబ్దాల నుంచి ఆడియన్స్ ని వివిధ పాత్రల ద్వారా అలరిస్తున్న జయరాం ఇంకా నటన కొనసాగిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."