MoviesTollywood news in telugu

మన్మధుడుకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?

Manmadhudu Movie : కె విజయ భాస్కర్ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. నాగ్ ని టాలీవుడ్ మన్మథుడిగా మార్చిన ఈ క్లాసిక్ మూవీ 2002డిసెంబర్ 20న రిలీజయింది. నాగ్ నటనతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ, మాటలు సినిమాకు ప్రాణం పోశాయి.

హీరోయిన్స్ గా సోనాలి బింద్రే, అన్షు నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఆకట్టుకునే పాటలు అందించారు. 10కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ డైరెక్ట్ గా 26సెంటర్స్ లో 100డేస్ ఆడింది. ఈ సినిమా బుల్లితెరమీద వస్తోందంటే చాలా ఇష్టంగా చూసే ఆడియన్స్ ఇప్పటికీ ఉన్నారు. మన్మధుడు మూవీకి రెండు వారాల ముందుగా అల్లరి నరేష్ , ప్రభుదేవా, సునీల్ నటించిన తొట్టిగ్యాంగ్ కామెడీతో తెరెకెక్కి మంచి విజయాన్ని అందుకుంది.

క్లైమాక్స్ లో వచ్చే సాంగ్స్ నవ్విస్తాయి. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఇదే రోజున కోడి రామకృష్ణ డైరెక్షన్ లో త్రినేత్రం మూవీ రిలీజయింది. కె ఆర్ విజయ, రాశీ, సింధు మీనన్ నటించిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. డిసెంబర్ 13న సందడే సందడి మూవీ వచ్చింది. జగపతి బాబు, శివాజీ, రాజేంద్రప్రసాద్ నటించిన ఈ మూవీ కూడా కామెడీ ప్రధానంగా తెరకెక్కింది. ముప్పలనేని శివ డైరెక్ట్ చేసాడు.

డిసెంబర్ 13నే ప్రేమలో పావనీ కళ్యాణి మూవీ రిలీజయింది. దీపక్, రస్నా బేబీ అంకిత కల్సి నటించిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. రియల్ స్టార్ శ్రీహరి నటించిన కూలి మూవీ కూడా ఇదే రోజున వచ్చింది. ఏ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాశి హీరోయిన్ గా చేసింది. అయితే సినిమా నిరాశ పరిచింది.

మన్మధుడు మూవీతో పాటు సచిన్, భావన నటించిన నిను చూడక నేనుండలేను మూవీ రిలీజయింది. ఆర్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిరాశ పరిచింది. డిసెంబర్ 27న మాస్ మహారాజ్ రవితేజ నటించిన అన్వేషణ మూవీ వచ్చింది. సాగర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కూడా ప్లాప్ అయింది.