MoviesTollywood news in telugu

ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు star హీరోయిన్…ఎవరో గుర్తు పట్టారా…?

Tollywood actress nivetha pethuraj : ఉత్తరాదిలో పోలిస్తే, దక్షిణాదిన హీరో హీరోయిన్స్ కి ఫాన్స్ ఎక్కువ ఉంటారు. అభిమానించడం, ఆరాధించడమే కాదు, ఖుష్బూ లాంటి వాళ్లకు గుళ్ళు కూడా కట్టేసిన సందర్భాలున్నాయి. ఇక సోషల్ మీడియా విస్తృతమయిన ప్రస్తుత పరిస్థితుల్లో సెలబ్రిటీలకు కూడా ఖాతాలున్నాయి. దాంతో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఫాన్స్ తో కూడా లైవ్ లో మాట్లాడుతూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు బదులిస్తున్నారు.

రష్మిక మందన్నా, పూజా హెగ్డే, సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తుంటే, ఫాన్స్ ఫిదా అవుతూ షేర్ చేయడం, కామెంట్స్ తో ముంచెత్తడం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్, కోలివుడ్‌లలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ చిన్నప్పటి రేర్ ఫోటో ఒకటి వైరల్ అయింది.

దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్‌లో ఓ చిత్రంలో పాటు ‘విరాటపర్వం’ మూవీలో కూడా నటిస్తోన్న నివేదా పేతురాజ్ మెంటల్ మదిలో మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.తెలుగులో యంగ్ హీరోలతో జతకట్టింది. చిత్రలహరి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుని, బ్రోచేవారెవరురా, అల.. వైకుంఠపురంలో, రెడ్,పాగల్ మూవీస్ లో చేసింది. తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన జోడి కట్టింది ఈ భామ.