Healthhealth tips in telugu

టమోటా తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయా…దీనిలో నిజం ఎంత…?

Tomatoes cause kidney stones In Telugu : ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారికి తీసుకొనే ఆహారం విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నవారు టమోటా తినవచ్చా అనే విషయాన్ని తెలుసుకుందాం.

సాధారణంగా మ‌నం తినే ఆహారాల్లో ఉండే మిన‌ర‌ల్స్‌, ఆగ్జ‌‌లేట్స్‌, కాల్షియంలు కిడ్నీల్లోని యూరిక్ యాసిడ్‌తో క‌లిసి రాళ్లుగా తయారవుతాయి.ఇలా రాళ్లుగా తయారుకావటానికి కొంత సమయం పడుతుంది. చిన్న రాళ్లుగా ఏర్పడి రాను రాను పెద్ద రాళ్లుగా మారతాయి. రాళ్ళు పెద్దగా అయ్యి నప్పుడు మూత్రాశ‌యానికి అడ్డుప‌డి మూత్రం రాకుండా చేస్తాయి.

దీంతో విప‌రీత‌మైన, భరించ‌లేని నొప్పి క‌లుగుతుంది. టమోటాలో ఆగ్జలైట్స్ ఎక్కువగా ఉండుట వలన రాళ్ళు ఏర్పడతాయి. కొంతమంది శరీర తత్వంలో ఈ ఆగ్జలైట్స్ ని శోషించుకొనే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు రాళ్ళు ఏర్పడతాయి. ఆగ్జలైట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం మానేయలి.

కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నవారు, వచ్చి తగ్గినవారు కూడా టమోటాకు దూరంగా ఉంటేనే మంచిది.అధిక బ‌రువు ఉన్న‌వారు, డ‌యాబెటిస్‌, హైబీపీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు కూడా ఆగ్జ‌లేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌కు దూరంగా ఉంటేనే మంచిదని డాక్టర్స్ అంటున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడూ టమోటా తినవద్దని డాక్టర్స్ కూడా చెప్పుతు ఉంటారు.