Healthhealth tips in telugu

1 లడ్డు తింటే…కీళ్లనొప్పులు,అలసట,నీరసం,కడుపులో మంట,షుగర్, గుండె సమస్యలు ఉండవు

black gram laddu benefits In telugu : పప్పుధాన్యాలలో మినుములకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మినప్పప్పుతో ఇడ్లీ, దోస, వడ అలా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మినప్పప్పును వేగించి పొడి తయారు చేసుకొని దానిలో బెల్లం, నెయ్యి వేసి లడ్డు తయారు చేసుకుని రోజుకి ఒకటి తింటూ ఉంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
Black gram Health benefits in telugu
జీవక్రియ రేటును మెరుగుపరిచే జీర్ణసంబంధ సమస్యలు అయినా గ్యాస్., కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
నీరసం అలసట నిస్సత్తువ లేకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా, బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి కీళ్ల నొప్పులు లేకుండా చేస్తుంది.

మినుములలో ఉండే సూక్ష్మ పోషకాలు ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది.ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తనాళాలు ధమనుల్లో ఏర్పడే ఒత్తిడిని తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.

మినుముల్లో రెండు రకాల పీచుపదార్థాలు ఉంటాయి. వీటిల్లో ఉండే కరిగే ఫైబర్ ఆహారం నుంచి శరీరం పోషకాలను గ్రహించడానికి సహాయ పడుతుంది. కరగని ఫైబర్ తీసుకున్న ఆహారం సక్రమంగా అరిగేలా చేస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి. ఇందులో ఉండే మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం తలనొప్పిని తగ్గిస్తాయి.