ఈ ఆహారాలతో తేనె కలిపి తీసుకుంటే చాలా ప్రమాదం… తెలుసా?
Honey benefits :తేనెలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనె ఆరోగ్య పరంగా,బ్యూటీ పరంగా బాగా సహాయ పడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గటానికి మరియు శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో మరియు ఫ్రూట్స్ ల తేనె కలిపి చాలా మంది తీసుకుంటూ ఉంటారు.

అయితే కొన్ని ఆహార పదార్ధాలతో తేనె కలిపి తీసుకోకూడదని మీకు తెలుసా? కొన్ని ఆహారాలతో తేనె కలిపి తీసుకుంటే ప్రమాదం అని నిపుణులు చెప్పుతున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముల్లంగితో తేనె కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే ముల్లంగిలో తేనె కలిపి తింటే శరీరంలో విషం ఉత్పత్తి అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
అలాగే ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగుతాము కదా అలాంటప్పుడు బాగా వేడిగా ఉన్న నీటిలో తేనె కలపకూడదు. గోరువెచ్చని నీటిలో మాత్రమే తేనెను కలపాలి. తేనె,నెయ్యి కలిపి తీసుకోకూడదు. నెయ్యి మరియు తేనె ప్రమాదకరమైన మిశ్రమం అని ఆయుర్వేదపు నిపుణులు చెబుతున్నారు.
మాంసాహారాలు మరియు తేనె కాంబినేషన్ కూడా ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు.ఇలా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ మరియు ఇతర అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలా మంది పాలల్లో పంచదారకు బదులు తేనె కలుపుకొని తాగుతారు. అలా తాగకూడదు. ఎందుకంటే తేనెతో కలిపి పాలు తీసుకోవడం వల్ల.అందులో ఉంటే ప్రోటీన్లు త్వరగా జీర్ణంగాక అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
https://www.chaipakodi.com/

