MoviesTollywood news in telugu

శ్యామ్‌‌సింగ రాయ్ విలన్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా ?

shyam singha roy vilan manish wadhwa : నేచురల్ స్టార్‌ నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ క్రి‍స్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24 విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. నాని డబుల్ రోల్ చేసిన ఈ మూవీలో ముఖ్యంగా ఇందులో నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ బాగుందనే టాక్‌ వచ్చింది.

ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి కూడా హీరోయిన్ గా నటించింది. మంచి వసూళ్ళతో దూసుకెళ్తున్న ఈ మూవీలో విలన్ గా మనీష్ వాధ్వా నటించి అదరగొట్టాడు. మహంత్ పాత్రలో విలనిజం పండించాడు. ఇంతకీ మనీష్ ఎవరంటే, 1972లో ముంబైలో పుట్టి, ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత బుల్లితెర నటుడుగా మారాడు. ఎక్కువగా చాణక్యుడు పాత్రలతో ఫేమస్ అయ్యాడు.

అలాగే చంద్రగుప్తమౌర్య, పద్మవాతార్ శ్రీకృష్ణ వంటి సీరియల్స్ లలో నటించి, బుల్లితెర ఆడియన్స్ ని మెప్పించాడు. అంతేకాదు, బాలీవుడ్ లో మణికర్ణిక, పద్మవత్ సినిమాలలో నటించి, సిల్వర్ స్క్రీన్ మీద అదరగొట్టాడు. ఇప్పుడు శ్యామ్‌‌సింగ రాయ్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

టాలీవుడ్‌లో పనిచేయాలనే తన కల నెరవేరిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనీష్ వాధ్వా చెప్పుకొచ్చాడు. మూవీలో కొద్దిసేపే కన్పించినప్పటికీ చాలా గంభీరమైన పాత్ర వేసాడు. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలోనే తెలుగులో మరో సినిమా ఛాన్స్ వచ్చిందని, వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపాడు.