తమిళ స్టార్ హీరో ధనుష్ బట్టల ఖర్చు ఎంతో తెలుసా ?
Star hero dhanush costumes cost : తమిళంలో పలు హిట్ మూవీస్ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న స్టార్ హీరో ధనుష్ తాజాగా తెలుగులో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య కూడా ఈ మూవీకి నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. దాంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
రంగ్ దే మూవీ తర్వాత వెంకీ అట్లూరి తెరకెకెక్కిస్తున్న ధనుష్ మూవీకి సార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ కి సంబందించి రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.
సహజంగా సినిమాల్లో సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ కి ఎక్కువగా ఖర్చు చేయడం చూస్తూనే ఉంటాం. అయితే ధనుష్ మూవీకి కూడా కాస్ట్యూమ్స్ కోసం 8లక్షలు మాత్రమే వెచ్చిస్తున్నారట. స్టార్ హీరో అనగానే కోట్లలో కాస్ట్యూమ్స్ కి పెట్టేస్తారు. కానీ ధనుష్ సింపుల్ గా ఉండాలని అనడంతో తక్కువలోనే చేస్తున్నారు. ఇక రెమ్యునరేషన్ కూడా తక్కువే కావడం విశేషం కాగా రఘువరన్ బిటెక్ డబ్బింగ్ మూవీతో టాలీవుడ్ లో ధనుష్ ఇప్పటికే పరిచయం అయ్యాడు.