దగ్గు,జలుబు,గొంతు,ఛాతీలోకఫం 1 రోజులో నాశనం చేసి immunity ని రెట్టింపు చేస్తుంది
Cold And Cough Home Remedies In Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దగ్గు, జలుబు,గొంతు నొప్పి వచ్చాయంటే చాలా ప్రారంభ దశలోనే తగ్గించుకోవాలి. అవి పెరిగాయంటే ఒక పట్టాన తగ్గవు. సమస్య చిన్నగా ఉంటే ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్ట సూచించిన మందులు వాడాలి.

మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఒక బౌల్లో ఒక స్పూన్ తేనె, పావు స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలిపి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే చాలా తొందరగా మంచి ఉపశమనం కలుగుతుంది.
పసుపు మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ములను తెచ్చుకుని ఆడించిన పసుపు అయితే మంచిది.ఇక తేనె విషయానికొస్తే ఆర్గానిక్ తేనె వాడితే మంచిది. మిరియాలను కూడా ప్యాకెట్లు దొరికే పొడి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న పొడి అయితే మంచిది.
పసుపు, తేనెలో, మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
ఇవి శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పికి కారణం అయిన వైరస్ పై పోరాటం చేసి దగ్గు,జలుబు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ నుండి చాలా తొందరగా ఉపశమనం వచ్చేలా చేస్తుంది. పసుపు, తేనె, మిరియాలు ప్రతి ఒక్కరి వంటింటిలో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కా ఫాలో అవ్వండి.

