Healthhealth tips in telugu

Weight loss Tips:నెల రోజుల్లో 10 కిలోల బరువు తగ్గించే బెస్ట్ టెక్నిక్…బరువు తగ్గడాన్నిఎవరు ఆపలేరు

Lemon and honey Weight Loss Tips In Telugu :ఈ రోజుల్లో అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. బరువు పెరగటం అనేది చాలా తొందరగా జరుగుతుంది. అదే తగ్గాలంటే చాలా రోజుల సమయం పడుతుంది. బరువు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.

అందువల్ల ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే చాలా సమర్ధవంతంగా పనిచేసి అధిక బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ ఎలా తయారుచేయాలి…ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒక గ్లాస్ లో అరస్పూన్ కలోంజీ గింజలను,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి వేడి నీటిని పోసి అరగంట అలా వదిలేయాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ తేనె కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే బరువు ఖచ్చితంగా తగ్గుతారు. అయితే ప్రతి రోజు తాగవలసి ఉంటుంది. కలోంజీ గింజలు బరువు తగ్గించటమే కాకుండా డయాబెటిస్, రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది.

ఈ డ్రింక్ తాగితే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరం అన్నీ రకాలుగా తట్టుకొనే శక్తి కలిగి ఉండాలి. బరువు అనేది ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలి. ఒక్కసారిగా పెరగకూడదు. ఒక్కసారిగా తగ్గకూడదు.

ఇలా జరిగితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా మన ఇంటి చిట్కాలను ఓపికగా పాటిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. అయితే కాస్త సమయాన్ని కేటాయించాలి. తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.