Healthhealth tips in telugu

రోజుకి 1 లడ్డు తింటే కీళ్లనొప్పులు,అధిక బరువు,రక్తహీనత,నీరసం,అలసట లేకుండా హుషారుగా ఉంటారు

Dry Fruit Laddu : శరీరంలో క్యాల్షియం లేకపోవడం, శారీరకంగా బలహీనంగా ఉండటం, శరీరంలో తగినంత రక్తం లేక రక్తహీనత సమస్య తో ఉండటం, థైరాయిడ్ సమస్య ఉండటం, ఎముకలు బలహీనంగా ఉండటం, అలాగే నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండటం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
Health Benefits of Dates
మనం ఈరోజు ఒక లడ్డు తయారు చేసుకుంటున్నాం. రోజుకి ఒక గ్లాసు పాలు, ఒక లడ్డు తింటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ లడ్డు ఎలా తయారు చేయాలి ఈ లడ్డూ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి వివరంగా తెలుసుకుందాం. ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేయించి పొట్టు తీసి రఫ్ గా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి.

ఒక కప్పు ఖర్జూరం తీసుకొని గింజలు తీసి ముక్కలుగా కట్ చేయాలి. ఖర్జూరం గట్టిగా ఉంటే వేడి నీరు పోసి రెండు గంటల పాటు నానబెట్టాలి. మిక్సీ జార్ లో ఖర్జూరం ముక్కలు, వేరుశనగ పొడి రెండు స్పూన్స్, ఒక స్పూన్ కోకో పొడి వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని మిగిలిన వేరుశనగ పొడి వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి. ఈ లడ్డులను రోజుకి ఒకటి తింటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గటమే కాకుండా అలసట,నీరసం, నిసత్తువ లేకుండా హుషారుగా ఉంటారు. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. 15 రోజుల పాటు ప్రతి రోజు ఒక లడ్డు తింటే ఆ తేడా మీకే కనిపిస్తుంది. ఈ లడ్డును ఏ సమయంలోనైనా తినవచ్చు.