1 స్పూన్ గింజలు తింటే -అధిక బరువు, కొలెస్ట్రాల్,డయాబెటిస్,అన్ని రకాల నొప్పులు ఉండవు
chia seeds in telugu : చియా విత్తనాలను సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు., ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు వీటిని చాలా తక్కువగా వాడే వారు. అలాగే చాలా తక్కువగా లభించేవి. కానీ ప్రస్తుతం విరివిగా లభించడమే కాకుండా వీటి వాడకం కూడా చాలా ఎక్కువైంది.

Chia seeds లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన తొందరగా ఆకలి వేయకుండా చేయటమే కాకుండా ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన మాంసాహారం తినలేని వారికి ఈ విత్తనాల ద్వారా ప్రోటీన్ బాగా అందుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
కాల్షియం, ఫాస్పరస్, మెగ్నిషియం, ప్రోటీన్లు సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా,ఆరోగ్యంగా ఉండి ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేసి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పుల వంటి అన్నీ రకాల నొప్పులను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ chia seeds వేసి మూడు గంటలు నానబెడితే ఆ గింజలు ఉబ్బి జెల్లీ మాదిరిగా అవుతాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు. లేదా జ్యూస్‌లు, సలాడ్‌లు, మజ్జిగ వంటి పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. చియా విత్తనాలను నేరుగా తినడం కంటే వీటిని వేరే ఆహార పదార్థాల్లో కలిపి తినడం వలన అధిక ప్రయోజనం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

