Healthhealth tips in telugu

రోజు 1 గ్లాస్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా కొవ్వు కూడా కరిగిపోతుంది

Immunity And Weight Loss : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవటం వలన ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అలా సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే డ్రింక్ ప్రతి రోజు తీసుకోవాలి. ఈ డ్రింక్ ప్రతి రోజు తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. దీని కోసం ఒక Orange రసం తీసుకొని పక్కన పెట్టాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో ఒక క్యారెట్ ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత Orange Juice వేసి మిక్సీ చేయాలి.

ఈ డ్రింక్ ని గ్లాస్ లోకి వడకట్టి పరగడుపున తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తీసుకోవాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తీసుకుంటే తేడా చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు.

అలాగే అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవాలి. ఈ డ్రింక్ తాగుతూ ప్రతి రోజు అరగంట వ్యాయామం లేదా యోగా తప్పనిసరిగా చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.