భోజనం చేసిన తర్వాత ఈ జ్యుస్ త్రాగితే…ఏమి జరుగుతుందో తెలిస్తే షాక్
Grape juice benefits :ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. శరీరానికి కీలకమైన విటమిన్లు, మినరల్స్ తో పాటుగా వ్యాధి నిరోధక శక్తిని సైతం ఇస్తాయి. చాలా మందికి ఇంతవరకే తెలిసి ఉండొచ్చు.. కాని బరువు తగ్గేందుకు కూడా ద్రాక్ష దోహదం చేస్తుంది. భోజనం చేసిన ప్రతిసారి ద్రాక్షలతో తయారైన ఈ మ్యాజిక్ డ్రింక్ ను తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారని ప్రయోగాత్మకంగా రుజువైంది.
కావల్సిన పదార్థాలు:
నల్ల ద్రాక్ష పండ్లు ఒక గ్లాస్ జ్యూస్ కి సరిపడా
ఒక స్పూన్ తేనె
తయారి విధానం
ద్రాక్షలను కోసి కడిగి సగానికి కోయాలి. వాటిల్లో నుంచి గుజ్జును మాత్రమే తీసుకోవాలి. ద్రాక్షలను పండించేందుకు ఇబ్బడి ముబ్బడిగా పురుగు మందులను కొడుతున్నారు. అందుకే పైన తొక్కను తొలగించడమే సేఫ్. ద్రాక్షల గుజ్జు, తేనెను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అంతే మ్యాజిక్ డ్రింక్ రెడీ.భోజనం చేసిన 20 నిమిషాల తర్వాత తాగాలి.
ప్రయోజనాలు:
ఈ మ్యాజిక్ డ్రింక్ కు మీరు అప్పుడే తీసుకున్న భోజనానికి చెందిన సగం క్యాలరీలను బర్న్ చేసే కెపాసిటీ ఉంది. శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలుండే ఈ డ్రింక్ లో పెక్టిన్, లైకోపిన్ అనే ప్రయోజనకర పోషకాలున్నాయి. పెక్టిన్ అనే పీచుపదార్థం రక్తంలో కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఇన్సులిన్ ను తగ్గిస్తుంది. జీవక్రియ (మెటబాలిజం)ను నియంత్రిస్తుంది. అంతే కాదు హై బ్లడ్ ప్రజర్ తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటుగా బరువు తగ్గుతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.