Health

తప్పక తెలుసుకోండి.. ఈ ఆకుకూర తింటే అస్సలు గుండె జబ్బులు వచ్చే చాన్సే లేదు

ఒకప్పటి కాలంలో గుండె వ్యాధులనేవి వయసు ఎక్కువగా ఉన్నవారికి వచ్చేవి. కానీ, ఇప్పటి తరుణంలో వయసు తేడా లేకుండా ఎవరు పడితే వారికి గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. అందుకు కారణం వారు సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం లేదని వైద్యులు వెల్లండిచారు. నేటి ఉరుకు పరుకు జీవితంలో డబ్బు డబ్బు అంటూ దీని కోసమే బ్రతుకుతున్నారు చాలా మంది.

ఇంకొందరైతే ఈ డబ్బు కోసం తినడం కూడా మానేస్తున్నారు. ఈ పద్ధతి ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. ఇలా చేయడం వలన గుండె వ్యాధులు కొని తెచ్చుకున్నట్టవుతుందని చెప్తున్నారు.గుండె వ్యాధుల నుండి విముక్తి పొందాలంటే.. నిత్యం పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల నుండి ఉపశమనం లభిస్తుందని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు.

పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పాలకూరలో కొన్ని పచ్చిమిర్చి, టమోటాలు, చింతపండు, ఉప్పు వేసి ఉడికించి మిశ్రమాన్ని అన్నంలో కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.వాల్‌నట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటలో ఎంతో దోహదం చేస్తాయి.

ఎందుకంటే.. ఈ చెడు కొలెస్ట్రాల్ కారణంగానే గుండె జబ్బులు వస్తున్నాయి. వాల్‌నట్స్‌ తీసుకోవడం వలన అధిక బరువు, హైబీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులు రావు. వాల్‌నట్స్‌లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తప్రసరణకు చాలా ఉపయోగపడుతాయి. కనుక రోజూ వాల్‌నట్స్ తీసుకోండి.. ఎలాంటి వ్యాధులు దరిచేరవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."