3 సార్లు తాగితే నడుము నొప్పి,మోకాళ్ళ నొప్పి,ఎముకల బలహీనత వంటివి జీవితంలో అసలు ఉండవు
Joint Pains Home Remedies : సాదరణంగా వయస్సు పెరిగే కొద్ది మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు,ఎముకల బలహీనత,నడుము నొప్పి వంటివి వస్తూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే పాలను తయారుచేసుకుందాం. ఈ పాలను తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. ముందుగా దీని కోసం ఒక పొడిని తయారుచేసుకోవాలి.

మిక్సీ జార్ లో 5 ముక్కలు ఎండుకొబ్బరి, మూడు స్పూన్ల తెల్ల నువ్వులు,పటిక బెల్లం వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువగా తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కొంచెం వేడి అయ్యాక ఒక స్పూన్ సొంపు, తయారుచేసి పెట్టుకున్న పొడిని ఒక స్పూన్ వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.
మరిగిన పాలను గ్లాస్ లోకి వడకట్టి తాగాలి. ఈ పాలను రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగితే నిద్రలేమి సమస్య తగ్గటమే కాకుండా ఉదయం లేవగానే నూతన ఉత్తేజంతో హుషారుగా ఉంటారు. ఈ పాలను తాగటం వలన నడుము నొప్పి,మోకాళ్ళ నొప్పి,ఎముకల బలహీనత వంటి అన్నిరకాల సమస్యలు తగ్గుతాయి.
డయాబెటిస్ ఉన్నవారు పటిక బెల్లం లేకుండా తాగాలి. ఈ పాలను వారంలో మూడు సార్లు తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు 15 రోజుల పాటు తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. మీరు కూడా ఈ పాలను తాగటానికి ప్రయత్నం చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

