ఈ పొడిని ఇలా తీసుకుంటే నరాల బలహీనత తగ్గటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది
Jajikaya Powder Benefits : జాజికాయ అంటే మనలో చాలా మందికి ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. దీనిలో ఎన్నో ఆరోగ్య,బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. జాజికాయను సాన మీద అరగదీసి తీసుకోవచ్చు. లేదా జాజికాయను పొడి రూపంలో తీసుకోవచ్చు. రోజులో 7 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

నోటిలో పుండ్లు ఉన్నప్పుడు జాజికాయను సాన మీద అరగదీసి నోటి పుండ్లు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి. అలాగే జాజికాయ పేస్ట్ తో పళ్లను తోమితే దంతాల సమస్యలు అన్నీ తొలగిపోవటమే కాకుండా నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది. యాంటీ డిప్రెసెంట్ గా పనిచేసి ఒత్తిడి,ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
రాత్రి సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు లేదా పాలల్లో జాజికాయ పొడి కలిపి తాగితే నరనరాల్లో బలం పెరిగి నరాల బలహీనత, శారీరక బలహీనత తగ్గుతుంది. అంతేకాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళను కరిగిస్తుంది.
జాజికాయ పొడిలో కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే రక్త సరఫరా మెరుగు పడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

