Beauty Tips

జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది

Hair Growth Tips In telugu : జుట్టు రాలకుండా బలంగా,ఆరోగ్యంగా పెరగాలంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. చాలా మంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా కంగారు పడతారు. అలా కంగారు పడవలసిన అవసరం లేదు. అవిసె గింజలు,బియ్యం,కలబంద జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి.
Kalabanda
రెండు స్పూన్ల అవిసె గింజలలో ఒక గ్లాస్ నీటిని పోసి పొయ్యి మీద పెట్టి మరిగిస్తే జెల్ తయారవుతుంది. ఈ జెల్ ని వడకట్టి ఒక బౌల్ లో వేయాలి. రెండు స్పూన్ల బియ్యంలో నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. ఈ అన్నాన్ని మెత్తగా చేయాలి. ఇక కలబందలోని జెల్ తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.

ఒక బౌల్ లో అవిసె గింజల జెల్,కలబంద పేస్ట్,మెత్తగా చేసిన అన్నం, ఒక స్పూన్ ఆముదంను వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించాలి. అరగంట అలా వదిలేసి ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జుట్టు మృదువుగా,ఆరోగ్యంగా పెరుగుతుంది. అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

ఇవి చుండ్రు సమస్యను,జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కలబందలో ఉన్న పోషకాలు తల మీద చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేసి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. ఆముదం,అన్నం కూడా జుట్టు సంరక్షణలో బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.