అరటిపండు తొక్క లో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా…అసలు నమ్మలేరు
Banana Peel benefits : మనం సాధారణంగా అరటిపండు తిని తొక్కను పాడేస్తూ ఉంటాం. నిజానికి అరటిపండు లో ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తిని పాడేసే అరటిపండు తొక్క లో కూడా అన్నే ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అరటిపండు తొక్క లో ప్రోటీన్ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్., కడుపుబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు డిప్రెషన్ తగ్గిస్తాయి. అందువల్ల డిప్రెషన్ తో బాధపడే వారిని అరటిపండు తొక్క తినమని డాక్టర్ సిఫార్సు చేస్తారు.
కాలిన గాయాలు పుండ్లు దెబ్బల పై అరటిపండు తొక్క తో మసాజ్ చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. అరటిపండు తొక్కతో పళ్ళు తోముకుంటే చిగుళ్ల సమస్యలు తొలగిపోయి దృఢంగా మారడమే కాకుండా మిలమిలా మెరుస్తాయి.
మొటిమల సమస్యకు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే అరటిపండు తొక్క లో యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన మొటిమల పైన అరటిపండు తొక్కతో రుద్దితే మొటిమల సమస్య తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

