Beauty Tips

Banana for Hair Growth:అరటిపండులో ఇది కలిపి జుట్టుకి పట్టిస్తే చుండ్రు,తలలో దురద తగ్గి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది

Banana for Hair Growth:చలికాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. చుండ్రు సమస్య వచ్చిందంటే ఒక పట్టానా తగ్గదు. అందువల్ల ప్రారంభంలోనే చుండ్రు సమస్యను తగ్గించు కోవటానికి ప్రయత్నం చేయాలి. చుండ్రు కనపడగానే మనలో చాలా మంది కంగారూ పడి మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు, తలలో దురద వంటి అన్నీ రకాల సమస్యల నుండి బయట పడవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముందుగా ఒక అరటి పండు తీసుకొని మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

ఈ పేస్ట్ లో ఒక స్పూన్ బాదం నూనె,ఒక స్పూన్ తేనె,అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి పావుగంట తర్వాత రెగ్యులర్ గా వాడే షాంపూ లేదా కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా తలలో దురద,మంట వంటివి కూడా తగ్గిపోతాయి.నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ జుట్టు మూలాల నుండి చుండ్రును తగ్గించటానికి సహాయపడుతుంది.

యాంటీమైక్రోబయల్ లక్షణాలు తల మీద ఇన్ ఫెక్షన్ లేకుండా చేస్తుంది. బాదం నూనె జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్ వంటివి చుండ్రును తగ్గించి జుట్టు కాంతివంతంగా మెరిసేలా కెఃస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.