ఈ ఒక్క స్పూన్ నూనె రాస్తే చాలు.. కీళ్ల నొప్పులు, నడుము నొప్పి మాయం!
Knee Pain Oil: ఒకప్పుడు పెద్దవారిలో కనిపించే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనేవి ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చేస్తున్నాయి. నొప్పులు రాగానే చాలా మంది పెయిన్ కిల్లర్స్ (Pain Killers) వాడుతూ ఉంటారు. అలా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇంటి చిట్కాలతో చాలా సులభంగా నొప్పులను తగ్గించుకోవచ్చు. ముందుగా 5 లవంగాలు, మూడు వెల్లుల్లిని దంచి ఉంచుకోవాలి. పొయ్యి మీద ముకుడు పెట్టి 50 Ml నువ్వుల నూనె పోయాలి. ఆ తర్వాత దానిలో దంచి ఉంచుకున్న లవంగాలు,వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి బాగా వేగేవరకు ఉంచి పొయ్యి మీద నుంచి దించాలి.
☛ Also Read: రోజుకు 2 సార్లు ఇది తీసుకుంటే.. దగ్గు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ మాయం!
కాస్త చల్లారాక ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. నొప్పులు ఉన్నప్పుడు ఈ నూనెను గోరువెచ్చగా చేసి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ నూనె రాసుకోవడం వల్ల పాదాల నొప్పులు (Leg Pain), అరికాళ్ళ (Foot Pain) మంట కూడా తగ్గుతుంది.
☛ Also Read: పాదాల్లో ఆనెలు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ చిట్కాతో ఒక్క రోజులోనే చెక్ పెట్టండి!
ఇలా ఇంట్లోనే నూనెను తయారు చేసుకుని ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. పైగా పెయిన్ కిల్లర్స్ వాడటం వలన వాటిలోని రసాయనాలు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు(Health Problems) వచ్చే అవకాశం ఉంది.
☛ Also Read: సాక్స్ వేసుకుని నిద్రపోవడం మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారు?
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Source: chaipakodi.com

