ఈ మసాలా దినుసులో ఉన్న ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు…ఇది నిజం
Japatri Health Benefits in Telugu : జాజికాయ పైపొరను ఎండబెట్టి జాపత్రి తయారు చేస్తారు. జాపత్రి అంటే మనలో చాలా మందికి మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు.

కొంతమంది మసాలా లకు దూరంగా ఉంటారు. అలాంటి వారు వారు కూడా ఈ విషయాలు తెలిస్తే తప్పకుండా తింటారు. జీర్ణ సంబంధ సమస్యలు అయినటువంటి వికారం, విరేచనాలు, కడుపు నొప్పులు మరియు గ్యాస్ సమస్యలకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు టీలో జాపత్రి వేసుకొని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

రోజువారీ ఆహారంలో జాపత్రిని చేర్చుకుంటే సన్నగా ఉన్న వారు లావుగా మారటమే కాకుండా ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంటారు. జాపత్రిలో ఉన్న ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే రక్తప్రసరణ సామర్ధ్యం కలిగి ఉండటం.రక్త ప్రవాహాన్ని పెంచి ఇతర ప్రాణాంతక సమస్యలతో పాటు డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

జాపత్రిలో ఉన్న లక్షణాలు ఆందోళన,ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది. దంత సమస్యలను తొలగించటమే కాకుండా నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. దంతాల నొప్పులు మరియు చిగుళ్ల వాపులను తగ్గించటంలో సహాయ పడుతుంది. అందువల్ల జాపత్రిని అనేక రకాల టూట్ పేస్ట్ లలో వాడుతున్నారు.

కిడ్నీలో రాళ్ళు అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. ఒకవేళ కిడ్నీలో రాళ్ళు ఉంటే, వాటిని కరిగించడానికి సహాయపడుతుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్లను తగ్గించటానికి సహాయపడుతుంది. జాపత్రి నూనెతో మసాజ్ చేయడం వల్ల కండరాలు మరియు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దగ్గు,జలుబును తగ్గించటానికి సహాయపడతుంది. దీని ఔషధ గుణాల కారణంగా దగ్గు సిరప్లు మరియు కోల్డ్ రబ్ల తయారీలో వాడుతున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

