మామిడి అల్లం తింటున్నారా…ఊహించని ఎన్నో ప్రయోజనాలు…అసలు నమ్మలేరు…ఈ సీజన్ లో…
Mango ginger Benefits In telugu : మామిడి అల్లంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనలో కొంతమందికి మామిడి అల్లం గురించి పెద్దగా తెలియదు. మామిడి అల్లం ఈ సీజన్ లో చాలా విరివిగా లభిస్తుంది. ఈ అల్లంను కట్ చేసినప్పుడు మామిడి కాయ వాసన వస్తుంది. అందువల్ల దీనికి మామిడి అల్లం అని పేరు వచ్చింది.
మామిడి అల్లంను ఆవకాయ,పచ్చడిగాను చేసుకోవచ్చు. కొంతమంది మామిడి అల్లంను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నిమ్మ రసం,ఉప్పులలో వేసి తింటూ ఉంటారు. ఈ రోజు మామిడి అల్లం తినటం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే మామిడి అల్లం తినని వారు కూడా తినటం అలవాటుగా చేసుకుంటారు.
ఒక కప్పు పాలలో 1 స్పూన్ మామిడి అల్లం తురుము వేసి మరిగించి త్రాగాలి. ఇది శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదలను నిరోధిస్తుంది, ఇది జీవక్రియ సమస్యలకు సహాయపడుతుంది. మామిడి అల్లం డయాబెటిస్ ఉన్నవారికి సహాయపడుతుంది. మామిడి అల్లంలో అనాల్జేసిక్ మరియు ఎక్స్‌పెక్టరెంట్ లక్షణాలు ఉండుట వలన దగ్గు,జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇది బ్రోన్కైటిస్ మరియు ఉబ్బసం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ మామిడి అల్లం తురుము వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. జీర్ణ శక్తిని ప్రోత్సహిస్తుంది మరియు ఆకలిని మెరుగు పరుస్తుంది. గ్యాస్,అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నొప్పుల నుండి ఉపశమనానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
50 గ్రాముల నువ్వుల నూనెలో 25 గ్రాముల మామిడి అల్లం ముక్కలను వేసి బాగా మరిగించి వడకట్టాలి. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. తాజా మామిడి అల్లం దొరికితే వాడండి..లేదంటే పొడిని కూడా వాడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.