ఇలా చేస్తే 99% కీళ్ల నొప్పులు,నడుం నొప్పి,కాళ్లు,చేతులో నొప్పులు అన్ని చిటికెలో మాయం అవుతాయి
Onion joint Pains Home Remedies : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి ఎన్నో రకాల నొప్పులు వస్తున్నాయి. నొప్పులు రాగానే కంగారు పడి పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. .

అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే వస్తువులతో నొప్పుల నుండి ఉపశమనం కలిగేలా చేసుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

ఈ నీటిని గ్లాసులోకి వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం లేదా రాత్రి పడుకోవడానికి ఒక అరగంట ముందు తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ ఉల్లిపాయ నీటిని తాగుతూ మరొక చిట్కాను ఫాలో అయితే నొప్పుల నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

చిన్న ఉల్లిపాయను తొక్క తీసి తురుముకోవాలి. అలాగే ఒక అంగుళం అల్లం ముక్కను శుభ్రంగా కడిగి పై తొక్క తీసి తురుముకోవాలి. ఒక బౌల్ లో ఉల్లిపాయ తురుము, అల్లం తురుము, అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి కవర్ అయ్యేలా ఒక క్లాత్ చుట్టాలి.

ఒక గంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రెండు చిట్కాలను ఫాలో అయితే నొప్పుల నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

