Healthhealth tips in telugu

ఇది పిచ్చి మొక్క కాదు…ఈ చెట్టు ఆకులు మోకాళ్ళ నొప్పులకు దివ్య ఔషధం

Talambralu Chettu Benefits in telugu :మన చుట్టు పక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అయితే వాటి గురించి మనకు తెలియక వాటిని పిచ్చిమొక్కలుగా భావిస్తాము. వాటిలో ఉన్న ప్రయోజనాలు గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి మొక్కలలో ఒకటి తలంబ్రాల మొక్క. ఈ చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది.
Talambralu Chettu Benefits in telugu
దీనిలో 150కి పైగా జాతులు ఉన్నాయి.కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టుని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు. ఈ చెట్టు రోడ్డు పక్కన పొలాల గట్ల మీద ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంది. ఈ చెట్టును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తలంబ్రాల చెట్టు ఆకుల్లో క్రిమినాశక, యాంటీమైక్రోబయాల్ లక్షణాలున్నాయి.
Talambralu Chettu Benefits in telugu
అందువల్ల గాయాలను నయం చేయటానికి చాలా బాగా సహాయపడతాయి. మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులను తగ్గించటానికి కూడా బాగా సహాయపడతాయి. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా 30 సంవత్సరాలు వచ్చే సరికి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులను తగ్గించటానికి పెయిన్ కిల్లర్స్ బదులు ఈ సింపుల్ చిట్కాని ఫాలో అవ్వండి.
Joint pains in telugu
తలంబ్రాల చెట్టు ఆకులను ఆముదంతో కలిపి మెత్తని పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో పైపూతగా రాసి ఒక క్లాత్ తో గట్టిగా కట్టాలి. ఇలా నెల రోజులపాటు చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వెన్నునొప్పి, రుమాటిజం, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

చివరగా దోమలను నివారించడంలో ఉపయోగపడుతుంది. దీని ఆకులను ఎండబెట్టి పొగ బెడితే దోమలు పారిపోతాయి. తలంబ్రాల చెట్టు ఆకుల్లో మిథనాలిక్ అండ్ ఇథనాలిక్ గుణాలు ఉండటం వలన దోమలు, కీటకాలు వెంటనే పారిపోతాయి. ఈ కాలంలో దోమల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆకులను ఉపయోగించవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.