Healthhealth tips in telugu

ఉదయం పరగడుపున 2 లేదా 3 ఆకులను నమిలితే జీవితంలో డాక్టర్ అవసరం ఉండదు

Pudina Health benefits in telugu :చలికాలంలో ఆకుకూరలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే ఆకుకూరలను తీసుకుంటూ ఉంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఈరోజు అటువంటి ఆకుకూరలలో ఒకటైన పుదీనా గురించి తెలుసుకుందాం. పుదీనాలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ పొటాషియం మాంగనీస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.
Pudina Health benefits in telugu
తక్కువ కేలరీలు తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది. ప్రతిరోజు రెండు లేదా మూడు పుదీనా ఆకులను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నోటి దుర్వాసన తొలగిపోయి శ్వాస తక్షణమే రిఫ్రెష్ అవుతుంది. అంతేకాకుండా దంతాలపై ఉండే పలకాన్ని తొలగిస్తుంది. అందుకే టూత్ పేస్ట్,మౌత్ వాష్ వంటి వాటిల్లో ఎక్కువగా పుదీనా ను వాడుతున్నారు.

పుదీనాలో ఉండే మెంతాల్ బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. శ్వాసకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. పుదీనాలో ఉండే మిధనాల్, క్రిమినాశక యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన అజీర్ణం గ్యాస్ కడుపు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
gas troble home remedies
అలాగే మలబద్దకం ఉన్నవారికి కూడా చాలా ఉపశమనం కలిగిస్తుంది. విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. పుదీనాను ఒక బ్రెయిన్ టానిక్ గా చెప్పవచ్చు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మెదడుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

కాస్త ఒత్తిడి, ఆందోళన ఉన్నప్పుడు పుదీనా ఆకులు వాసన చూస్తే తక్షణమే ప్రశాంతత కలుగుతుంది. దీనిలో ఉండే ఉత్తేజకరమైన సువాసన ఒత్తిడిని తగ్గించటానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గాలని ప్రణాళికతో ఉన్నవారు రోజూ పుదీన ఆకులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బ్లాక్ హెడ్స్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం పుదీనా ఆకులను నీటిలో మరిగించి మెత్తని పేస్ట్ గా చేసి దానిలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
Young Look In Telugu
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ తగ్గిపోవడమే కాకుండా నల్లని మచ్చలు కూడా తొలిగిపోతాయి. చర్మాన్ని మృదువుగా ఆరోగ్యవంతంగా మెరిసేలా చేస్తుంది. పుదీనాను ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లో పెంచుకుంటున్నారు. ఇలా ఇంట్లో పెంచుకుంటే రోజుకి రెండు లేదా మూడు తాజా ఆకులను కోసుకుని తినవచ్చు.

తాజా ఆకులను తీసుకుంటే చాలా మంచిది కాబట్టి మీరు కూడా రోజుకు రెండు లేదా మూడు ఆకులను ఉదయం పరగడుపున తినటం కుదరకపోతే రోజులో ఏ సమయంలోనైనా తినటం అలవాటు చేసుకోండీ. ప్రస్తుతం ఆకుకూరలు చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. కాబట్టి ఆకుకూరలను వారంలో 2 లేదా 3 సార్లు తీసుకోవటం అలవాటుగా చేసుకోండీ.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.