Kitchenvantalu

15 రోజులు అధిక బరువు,రక్తహీనత, అలసట,నీరసం అనేవి అసలు ఉండవు

Carrot Turmeric drink In Telugu : మారిన జీవనశైలి పరిస్థితులు కారణంగా మనలో చాలా మంది అధిక బరువు, రక్తహీనత వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు ఉన్నప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సమస్యలు ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయకుండా నివారణ మార్గాల వైపు అడుగులు తప్పనిసరిగా వేయాలి.

డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్తే డ్రింక్ తీసుకుంటే చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ డ్రింక్ ప్రతి రోజు 15 రోజుల పాటు తాగితే అధిక బరువు, రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో క్యారెట్ ముక్కలను వేయాలి.
weight loss tips in telugu
ఆ తర్వాత అర స్పూన్ పసుపు, పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ అశ్వగంధ పొడి, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు ఖర్జూరాలు గింజలు తీసి వేయాలి. ఆ తర్వాత ఒక గ్లాసు ఇంటిలో తయారుచేసుకున్న బాదంపాలు, పావు స్పూను శొంఠి పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

అంతే ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న డ్రింక్ తయారైనట్టే. ఈ డ్రింక్ ని ప్రతిరోజు ఒక గ్లాసు తాగితే రక్తహీనత సమస్య తొలగిపోతుంది. అలాగే జీవక్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారటమే కాకుండా వేగంగా బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. .
Brain Foods
మెదడు పనితీరును మెరుగుపరచి వయసు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపక శక్తి సమస్యలు, మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది. అలాగే ఈ సీజన్ లో రోగ నిరుద్యోగ వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఏ సమస్యలు లేని వారు వారంలో రెండు సార్లు ఈ డ్రింక్ తాగితే మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.