Healthhealth tips in telugu

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

Lungs Health Foods: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్., ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, బి కాంప్లెక్స్ విటమిన్, విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉంటూ పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
lungs
ఎర్రగా చిన్నసైజులో కనిపించే బెర్రి పండ్లు అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన వ్యాధికారక బ్యాక్టీరియాతో పోరాటం చేసి వాటిని నాశనం చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం చేస్తుంది. ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తుంది.

ఆకుకూరల్లో విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వల్ల ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తుంది. ఆకుకూరలను వారంలో మూడు సార్లు తీసుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి

ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితులకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా వాల్ నట్స్ అనేవి డయాబెటిస్, ఊపిరి తిత్తులకు సంబంధిత వ్యాధులను తగ్గించటానికి సహాయం చేసి జీవక్రియ రేటును పెంచుతాయి.
broccoli
బ్రోకలీ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఇతర ఆహారాలతో పోలిస్తే శక్తివంతమైన ఆహారంగా చెబుతారు. వారంలో రెండు సార్లు తీసుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
apple
యాపిల్ పండులో కూడా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టరుకు దూరంగా ఉండొచ్చు అని నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది.

మిరియాలలో ఉండే విటమిన్ సి లంగ్స్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి ఫ్రీ రాడికల్స్ ని ఫార్మ్ చేసే టాక్సిన్స్ ని నాశనం చేస్తుంది. లంగ్ టిష్యూ డ్యామేజ్ జరిగే అవకాశం తగ్గుతుంది, డ్యామెజ్ అయిన టిష్యూ రిపేర్ అవ్వడానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.