రోజుకి 1 లడ్డు తింటే అధిక బరువు, అలసట,నీరసం,రక్తహీనత వంటివి ఉండవు
Dates coconut balls Benefits in telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. సమస్యలు తగ్గాలన్న ఏ సమస్యలు రాకుండా ఉండాలన్న మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఈ లడ్డు ని ప్రతిరోజు తింటే ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు. .

ముఖ్యంగా థైరాయిడ్, రక్తహీనత,అధిక బరువు వంటి సమస్యల నుంచి బయటపడటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఇప్పుడు లడ్డు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక కప్పు జీడిపప్పు వేసి డ్రై రోస్ట్ చేయాలి. మిక్సీ జార్ లో ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము, వేగించి పెట్టుకున్న జీడిపప్పు, ఒక కప్పు ఎండు ద్రాక్ష వేయాలి.

ఆ తర్వాత గింజ తీసిన ఐదు ఖర్జూరాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న లడ్డూల మాదిరిగా తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలను ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా పది రోజులపాటు నిల్వ ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ లడ్డూలను తినవచ్చు. .

ప్రతిరోజు ఒక లడ్డు తింటే అలసట, నీరసం వంటివి లేకుండా చురుకుగా ఉంటారు. అలాగే రక్తహీనత., థైరాయిడ్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మెదడు చురుగ్గా పనిచేసే జ్ఞాపకశక్తి., ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా చదివిన విషయాలు బాగా గుర్తుండటానికి పిల్లలకు బాగా సహాయపడుతుంది.

అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఆకలి తగ్గి జీర్ణక్రియ రేటు బాగా పెరిగి తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేసి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి కూడా వేయదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

