Kitchenvantalu

15 రోజులు 1 గ్లాసు అధిక బరువు ,బొడ్డు కొవ్వు,శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిస్తుంది

Weight Loss Tips In Telugu In one week :ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ అయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.
Weight Loss tips in telugu
మనలో చాలా మంది వేల కొద్ది డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు.
dhaniyalu
అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే కచ్చితంగా అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ డ్రింక్ తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణప్రక్రియ బాగుంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది.
jeelakarra Health Benefits in telugu
ఒక స్పూన్ ధనియాలు,ఒక స్పూన్ జీలకర్ర,4 రెబ్బల కరివేపాకు ఆకులను నూనె లేకుండా వెగించి పొడి చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడిని వేసి బాగా కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే దాదాపుగా 5 కేజీల బరువు తగ్గవచ్చు.
curry leaves
ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా కెఃస్తుంది. కాబట్టి ఈ డ్రింక్ ని తాగటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.