Kitchenvantalu

1 గ్లాసు నీరసం,అలసట,నిస్సత్తువ వంటివి లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది

Mint Lemon Water Benefits In Telugu : ఈ మధ్యకాలంలో మనలో చాలామంది అలసట, నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విధంగా నీరసం ఉన్నప్పుడు ఏ పని మీద దృష్టి పెట్టలేరు. ఏ పని చేయాలని అనిపించదు. చాలా చిరాకుగా కూడా ఉంటుంది.
weight loss drink
నీరసం అనేది శ్రమకు మించి పనిచేయటం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, నిద్ర లేకపోవడం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో వస్తుంది. ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ ఉదయం సమయంలో తీసుకుంటే అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

ఒక గ్లాసు నీటిలో అర స్పూన్ చియా సీడ్స్ వేసి పావు గంట సేపు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వలన చియా గింజలు జెల్లీలా ఉబ్బుతాయి. ఆ తర్వాత చిటికెడు మిరియాల పొడి., చిటికెడు ఉప్పు, పావు స్పూన్ అల్లం తురుము, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ పంచదార నాలుగు పుదీనా ఆకులు వేసి స్పూన్ తో బాగా కలపాలి.
Ginger benefits in telugu
ఆ తర్వాత చివరగా రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ వేసి కలిపితే డ్రింక్ తయారైనట్టే. నీరసంగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ తాగితే నిమిషాల్లోనే యాక్టివ్ గా మారుతారు. ఈ డ్రింక్ ని ఉదయం సమయంలో తీసుకుంటే నీరసం., అలసట వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా పనులను చేసుకుంటారు.
lemon benefits
ఈ డ్రింక్ తాగడం వలన ఆందోళన, ఒత్తిడి వంటివి ఏమీ ఉండవు. మైండ్ రీఫ్రెష్ అవుతుంది. నీరసంగా ఉన్నప్పుడు ఇటువంటి డ్రింక్స్ తాగితే మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నీరసంగా ఉన్నప్పుడు మార్కెట్ లో దొరికే energy drinks తాగటం కన్నా మన ఇంటిలో తయారుచేసుకున్న ఇటువంటి డ్రింక్స్ తాగటం అలవాటుగా చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.