5 నిమిషాల్లో పళ్లపై ఉన్న గార, పసుపు మొత్తం తొలగిపోయి తెల్లగా మెరుస్తాయి
Teeth whitening tips In Telugu : పళ్ళు తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పసుపుపచ్చగా, గార పట్టిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. చాలా తక్కువ ఖర్చుతో సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

దంతాలపై పసుపు మరకలు, గార ఉండటం వలన ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అలాగే మనస్ఫూర్తిగా నవ్వటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువలన పసుపుగా మారిన పళ్ళను తెల్లగా మార్చుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు. అలాంటివారికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల నిమ్మరసం., ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో దంతాలకు రాసి సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు రుద్దాలి.

ఆ తర్వాత గోరువెచ్చని నీటితో దంతాలు మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే దంతాలపై ఏర్పడ్డ పసుపు రంగు, గార వంటివి అన్నీ క్రమంగా తొలగిపోతాయి. కాస్త శ్రద్ధగా సమయాన్ని కేటాయించి ఇంటి చిట్కాలను ఫాలో అయితే తెల్లని దంతాలను సొంతం చేసుకోవచ్చు. ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
