Movies

10 Th క్లాస్ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు

తమిళ డబ్బింగ్ సినిమా ప్రేమిస్తే తెలుగు నాట ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో మనకు తెలిసిన విషయమే. ప్రేమిస్తే సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ కావటంతో తెలుగులోకి డబ్ చేసారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. క్రియేటివ్ దర్శకుడు శంకర్ అసిస్టెంట్ బాలాజీ శక్తివేల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బాలాజీ శక్తి వెల్ ట్రైన్ లో ప్రయాణం సెహెస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడు చెప్పిన నిజమైన ప్రేమ కథను విని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం పల్లెటూరి అమ్మాయి కావాలని దర్శకుడు తిరిగి తిరిగి చివరకు సంధ్యను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో సంధ్య స్నేహితురాలిగా తెలుగు అమ్మాయి శరణ్య నటించింది.

2004 లో వచ్చిన ప్రేమిస్తే సినిమా ద్వారా సంధ్య హీరోయిన్ కాగా,సంధ్య స్నేహితురాలిగా నటించిన శరణ్య కూడా హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత శరణ్య తెలుగు సినిమాల్లో కూడా నటించింది. శరణ్య తలితండ్రులు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు. ఆమె తల్లితండ్రులు చిన్నప్పుడే చెన్నైలో సెటిల్ అవటంతో శరణ్య చదువు మొత్తం తమిళనాడులోనే సాగటంతో ఆమెకు తమిళం చదవటం,రాయటం వచ్చు.

శరణ్య చెన్నయ్ లోని సెయింట్ మేరీ పాఠశాలలో చదివింది. చదువుకొనే రోజుల్లోనే శరణ్య నాటకాలను వేయటం ప్రారంభించింది. అది చూసిన జూనియర్ దర్శకుడు ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రకు ఎంచుకున్నాడు. ప్రేమిస్తే సినిమా సమయంలో ఆమె 9 వ తరగతి చదువుతుంది.

తెలుగులో 10 th class సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరును సంపాదించింది. ఆ తరవాత తమిళంలో అనేక సినిమాలను చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తమిళనాడుకి చెందిన ఒక పారిశ్రామిక వేత్త కుమారుడిని వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."