రానా చెల్లి మాళవిక గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు
సహజంగా టాలీవుడ్ లో గానీ, బాలీవుడ్ లో గానీ సెలబ్రిటీల వారసులు సినిమాల్లోనే తమ కెరీర్ వెతుక్కునే ప్రయత్నం ఏనాటి నుంచో వస్తున్నదే. అలా ఎందరో హీరోలుగా గానీ , వివిధ విభాగాల్లో గానీ స్థిరపడ్డారు. అయితే కొంతమంది మాత్రం తమకు నచ్చిన కెరీర్ ఎంచుకుని స్థిరపడి పోతుంటారు. అందులో నిర్మాత డి సురేష్ బాబు కుమార్తె మాళవిక ఒకరు. హీరో రానా సోదరిగా బాగా పరిచయమైన ఈమె దగ్గుబాటి వంశంలో బాగా చదుకున్న అమ్మాయి. సురేష్ బాబుకి కుమారులు రానా,అభిరాం కన్నా,మాళవిక అంటేనే ఎక్కువ ప్రేమ.అందుకే మాళవిక ను ఎంతో ప్రేమగా పెంచారు. ఇక తాతయ్య డాక్టర్ డి రామనాయడు కూడా దగ్గుపాటి వంశంలో తొలి అమ్మాయి కనుక చాలా గారాబంగా చూసేవారట.
చిన్నప్పటినుంచి చదువుపై ఎక్కువ శ్రద్ధ కనబరిచిన మాళవిక మేనేజ్ మెంట్ కోర్సులో మాస్టర్ డిగ్రీ అందుకుంది. ఈమెకు కావ్య కన్సల్టెన్సీ వంటి ప్రముఖ సంస్థలో జాబు వచ్చింది. అప్పట్లో ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజి కూడా అఫర్ చేశారట. అయితే జాబు చేస్తున్నప్పుడే ఆమెకు పెళ్లయింది.నిజానికి ఈ సంబంధం వెంకటేష్ భార్య నీరజ తరపు బంధువులట. అందుకే మాళవిక ఇంక మరో ఆలోచనకు లేకుండా పెళ్ళికి ఒకే చెప్పడంతో ఆమె వివాహం 2012డిసెంబర్ 5న అత్యంత వైభవంగా జరిగింది.
ఆమె భర్త పేరు పొట్లూరి భరత్ కృష్ణారావు. వాళ్ళ సొంతూరు చిత్తూరు అయినప్పటికీ వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. భరత్ ఫామిలీకే బెంగళూరులో చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలున్నాయి. వాటి ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట.ఇక 2015లో మాళవిక పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె కుటుంబంతో కల్సి బెంగళూరులోనే ఉంటోంది.
ప్రతి రాఖీ పండగకు హైదరాబాద్ వచ్చి రానా, అభిరామ్ లకు రాఖీ కట్టి మురిసిపోతుంది. అలాగే బాబాయ్ వెంకటేష్ కొడుకు అర్జున్ కి కూడా రాఖీ కట్టందే తిరిగి వెళ్లదు. రానాకు అంటే పంచప్రాణాలు. ఆమె పెళ్ళికి రానాయే అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. రాజమౌళి, పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ ప్రముఖులే కాదు,బాలీవుడ్ నుంచి అభిషేక్ బచ్చన్ వంటి వాళ్ళు వచ్చారంటే రానా పడిన శ్రమ ఎంతో వేరే చెప్పక్కర్లేదు.