MoviesTollywood news in telugu

పెదరాయుడు సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఊహించని లాభం…ఎంతో…?

Mohan Babu Pedarayadu Movie :రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన పెదరాయుడు మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నటించిన ఈ సినిమా కాసుల వర్షం కూడా కురిపించింది. ఉమ్మడి కుటుంబం, పెద్దరికాన్ని గౌరవం, ఊళ్ళో తప్పు జరిగితే ఇచ్చే తీర్పులో తరతమ బేధాలు కూడదని చాటిన సినిమా ఇది.

1994లో తమిళనాడులో నాట్టమై మూవీ వచ్చింది. ఊరి పెద్దగా షణ్ముగం నటించగా, తమ్ముడిగా శరత్ కుమార్ ద్విపాత్రాభినయం చేసాడు. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడడంతో వెంటనే రజనీకాంత్ తన ఫ్రెండ్ మోహన్ బాబుకి ఫోన్ చేసి, తెలుగులో హక్కులు కొనేలా చేయడమేకాదు, చిన్నదైనా సరే, రాయుడు పాత్ర కూడా వేస్తానని కూడా హామీ ఇచ్చారు.

అప్పటికే ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న మోహన్ బాబు వెంటనే రీమేక్ హక్కులు కొనేసి, రవిరాజా పినిశెట్టిని డైరెక్టర్ గా తీసుకున్నారు. పెదరాయుడు వచ్చి పాతికేళ్ళు అవుతున్నా ఈ పాత్రలో ఇంకొకరిని ఊహించుకోవడం కష్టమే. అపార్ధంతో విర్రవీగే భారతి పాత్ర సౌందర్యకు బుద్ధివచ్చేలా ఆంగ్లంలో పెదరాయుడు పలికే డైలాగులకు చదువురానివాళ్ళే ఈలలు వేశారు.

రాయుడు భార్యగా భానుప్రియ మంచి పాత్ర వేసింది. మొదటి భాగంలో అహంకారంతో వ్యవహరించినా, తప్పు తెలుసుకుని బాధ్యతగల ఇల్లాలిగా సౌందర్య రెండు వెర్షన్స్ అద్భుతంగా పోషించింది. సత్యనారాయణ, శుభశ్రీ, జయంతి, చలపతిరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, విలన్ ఆనందరాజ్ తదితర తారాగణం తమ పాత్రల్లో ఇమిడిపోయారు. ఇక 20 నిముషాలు కనిపించే పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ చెలరేగిపోయాడు.

స్టైలిష్ గా కండువా తిప్పుకోవడం, చుట్ట వెలిగించడం, చెల్లెలి కొడుకు తప్పుచేస్తే ఇచ్చే తీర్పు సమయంలో వ్యవహరించిన తీరు ఇవన్నీ ఫాన్స్ చేత చప్పట్లు కొట్టించాయి. రచయిత సత్యమూర్తి చూపించిన తీరు వలన ఈ సినిమా ఎక్కడా బాలన్స్ తప్పలేదు. పైగా తమిళంలో డబ్బింగ్ చేసినా అక్కడా ఆడింది.

1995జూన్ 15న రిలీజ్. అదేరోజు మెగాస్టార్ బిగ్ బాస్ రిలీజ్. దానిదెబ్బకు పెదరాయుడు నిలుస్తుందా అనుకున్నారు. కానీ రెండు రోజులకే మొత్తం హిట్ టాక్. ప్రింట్స్ సంఖ్య కూడా పెరిగింది. బిగ్ బాస్ దెబ్బతినేసింది. పైగా ఘరానా మొగుడు రికార్డులను రెండు కోట్ల మార్క్ దాటి పెదరాయుడు బ్రేక్ చేసాడు. 40సెంటర్స్ లో 100డేస్ ఆడింది. పెదరాయుడు మూవీ ఇప్పటి తరానికి కూడా గుణపాఠమే.