Movies

గుండమ్మ కథ సినిమా గురించి ఈ నమ్మలేని నిజాలు తెలుసా… అసలు నమ్మలేరు

Gundamma katha Telugu Movie :ఇప్పుడైతే హీరోల ఇమేజ్ కి తగ్గట్టు సినిమా టైటిల్స్ ఉండాలి. లేకుంటే ఫాన్స్ ఒప్పుకోరు. అయితే ఆ రోజుల్లో ఇద్దరు అగ్ర హీరోలు నటించే సినిమాలో గయ్యాళి పాత్ర పేరునే సినిమా టైటిల్ గా పెడితే ఆడియన్స్ సహృదయంతో ఆదరించారు. అదే గుండమ్మ కథ.

ఓ పక్క ఎన్టీఆర్, మరోపక్క అక్కినేని. మల్టీస్టారర్ మూవీలో ఇద్దరి అగ్ర హీరోయిన్స్ సావిత్రి, జమున. అయితేనేం సూర్యకాంతం పాత్ర పేరే సినిమాకు పెట్టారు. జనంలోకి దూసుకుపోయిన ఈ మూవీని విజయ వాళ్ళు నిర్మించారు. జానపద చిత్రాల డైరెక్టర్ బి. విఠలాచార్య డైరెక్షన్ లో వచ్చిన కన్నడ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.

విజయా సంస్థలోనే ఈ మూవీ చేయడం, నాగిరెడ్డ్డి ఆర్ధిక సాయం చేయడంతో ఈ సినిమా అన్ని భాషల హక్కులను కృతజ్ఞతగా విఠలాచార్య ఇచ్చేసారు. తన సోదరుడు విదేశాల్లో వ్యాపారం చేసి నష్టపోవడంతో ఆ అప్పు నాగిరెడ్డి తీర్చారు. ఆ సొమ్ము భర్తీకోసం గుండమ్మ కథ తీయాలన్న యోచన వచ్చింది. కన్నడంలో గుండమ్మకు భర్త , సొంత కూతురు, సవితి కూతురు ఉంటారు. సవతి కూతురిని ఓ పిచ్చోడికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది.

అయితే గుండమ్మ మీద కసితో సవతి కూతురు మేనమామ ఓ అబద్ధం చెప్పి గుండమ్మ కూతురిని కూడా ఓ జైలు పక్షితో పెళ్లి జరిపిస్తాడు. ఇక దాంతో నానా గొడవ జరుగుతూ ఉంటుంది.అయితే దీన్ని రీమేక్ చేయడానికి డివి నరసరాజు , బి ఎన్ రెడ్డి కల్సి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. అయితే పెద్ద సినిమా కనుక బి ఎన్ రెడ్డి కంటే పి పుల్లయ్య మంచిదని నాగిరెడ్డి భావించారు.

ఆయన తర్వాత వెనక్కి తప్పుకున్నారు. దీంతో చక్రపాణి ఎంటరయ్యారు. కేవలం ఎన్టీఆర్ తో పాటు అక్కినేని పాత్ర కూడా పెట్టారు. గుండమ్మ, సవితి కూతురు ,సొంత కూతురు ఈ మూడు పాత్రలే కన్నడం నుంచి తీసుకున్నారు. తన ప్రేయసి ఉందా అని అక్కినేని అడక్కుండా విజిల్ వేసి అడగడం సీన్ రాసారు.

దాంతో చివరి వరకూ విజిల్ వేసి నడపాలని చక్రపాణి సూచించారు. ఏ రోజు డైలాగులు ఆరోజే రాయడం నరసరాజు అప్పుడే మార్చుకున్నారు. ఇక గుండమ్మ భర్త లేకుండా ఆ పాత్రను పీకేయమ్మని చక్రపాణి చెప్పడంతో కథ వేగంగా నడిచేలా చేసింది. మొత్తానికి గుండమ్మ కథగా ఈ మూవీ పాపులర్ అవ్వడంతో సినిమా పూర్తయ్యాక అదే టైటిల్ పెట్టారు. ఎంతమంది ఆర్టిస్టులు అందుబాటులో ఉంటె అంతమంది తోనే సినిమా తీసేసేవారట.

ఇక పై మెట్లతో స్టూడియోలో వేసిన సెట్ చాన్నాళ్లు అలాగే ఉంచేసారట. కొలొకోలోయమ్మ సాంగ్ లో హీరోలు ఇద్దరూ, హీరోయిన్స్ ఇద్దరూ కనిపిస్తారు. కానీ షూటింగ్ విడివిడిగా తీశారు. కానీ రెండు జంటలను కల్పినట్లు చూపించారు. అక్కినేని, జమున లతో ఊటీ,బృందావనం లలో ఓ సాంగ్ షూట్ చేయాలనుకుంటే, ఎందుకు మన గార్డెన్ లో తీద్దామని చక్రపాణి అన్నారట.

అలా ప్రేమ యాత్రలకు బృందావనం, నన్దనవనమూ ఏలనో అనే సాంగ్ ని పింగళి రాశారట. అలాగే ఎల్. విజయలక్ష్మి సాంగ్ ని కూడా కథలో కలిసిపోయేలా హరనాధ్ ,జమున వాళ్ళు చూస్తున్నట్లు షూట్ చేయించారట. 1961డిసెంబర్ కి సగానికి పైనే షూటింగ్ పూర్తయింది. 1962జూన్ 7న రిలీజయింది. ప్రివ్యూ చూసే సినిమా హిట్ అవుతుందని చక్రపాణి అంచనా వేసినట్టే సినిమా సూపర్ హిట్ అయింది.

24కేంద్రాల్లో వందరోజులు ఆడింది. అక్కినేని,ఎన్టీఆర్ కల్సి చాలా సినిమాలు చేసినప్పటికీ గుండమ్మ కథ ప్రత్యేకత సంతరించుకుంది. ఎన్టీఆర్ కి ఇది 100వ మూవీ. అక్కినేని కి 99వ మూవీ. ఇక టైటిల్స్ లో ఎవరి పేరు ముందు వేయాలన్న పరిస్థితి వచ్చినపుడు అందరి బొమ్మలు కల్పి తెరపై చూపించేసారు. ఘంటసాల సంగీతం సూపర్భ్ . అందుకే సినిమా లో పాటలు ఇప్పటికీ జనరంజకమే.