Healthhealth tips in teluguKitchen

ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ జావ తాగితే… ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉన్నవారు…

saggubiyyam java health benefits In Telugu : సగ్గుబియ్యంను మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్నారు. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా కొవ్వు తక్కువగా ఉండుట వలన అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. అలాగే సగ్గుబియ్యం చాలా తేలికగా జీర్ణం అవుతాయి.

రెండు స్పూన్ల సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి నీటిని పోసి అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత నానిన సగ్గుబియాన్ని ఉడికించి గ్లాసు వేడి పాలలో కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ బెల్లం తురుము వేసి బాగా కలిపి ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి. ఉదయం సమయంలో కుదరని వారు సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు.
saggubiyyam beenfits
సగ్గుబియ్యంలో పొటాషియం,పాస్పరస్,కాల్షియం,కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, సోడియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. సగ్గుబియ్యం రెగ్యులర్ గా తీసుకుంటే రక్త కణాల సంఖ్య పెరిగి ఐరన్ లోపం తొలగిపోయి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. అలాగే ఎముకలు మరియు కండరాలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా అధిక బరువు సమస్య కూడా తొలగిపోతుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
పొట్టకు సంబంధించిన సమస్యలు ఏమి ఉండవు. గ్యాస్, కడుపు ఉబ్బరం., అజీర్ణం వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. గర్భిణీ స్త్రీలకు కూడా మంచిది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తప్రసరణ బాగా జగడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు
Diabetes diet in telugu
డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్నవారికి నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలసట నీరసం నిస్సత్తువ ఉన్న సమయంలో ఈ సగ్గుబియ్యంతో తయారుచేసిన జావను తీసుకుంటే వెంటనే నూతన ఉత్తేజం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.