MoviesTollywood news in telugu

గోపీచంద్ గోలీమార్ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Gopichand golimaar movie online In Telugu : దర్శకుడు టి. కృష్ణ కొడుకుగా టాలివుడ్ కి ఇచ్చిన గోపీచంద్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. విలన్ గా వేస్తూ హీరోగా మారి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న హీరో గోపీచంద్ తన స్టామినాతో హిట్ కొట్టిన సినిమా పేరు చెప్పగానే గోలీమార్ గుర్తొస్తుంది. అయితే ఈ సినిమా 15కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసుకుని, వారంలో 9కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

80సెంటర్స్ లో 100రోజులు, 25కోట్ల గ్రాస్, 17కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. హిందీలో డబ్ అయిన ఈమూవీతో బాలీవుడ్ కి గోపీచంద్ పరిచయం అయ్యాడు. ఏక్ నిరంజన్ నిరాశ పరచడంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డైరెక్టర్ పూరి జగన్నాధ్ కసిగా చేసిన సినిమాయే గోలీమార్. నిజానికి చిరుత మూవీ తర్వాత ఇతడికి హిట్ పడలేదు.

ఎన్ కౌంటర్ స్పెషల్ తో రాసుకున్న కథకు బూజు దులిపాడు. గోలీమార్ మూవీని మహేష్ బాబుతో చేయాలనీ పూరి ట్రై చేసాడు. అయితే ఖలేజా మూవీ లేట్ అవుతూ వస్తోంది. ఇది ఎప్పుడవుతుందో తెలీడం లేదు ఇది అయ్యాక చేద్దాం అని మహేష్ అన్నాడు. దాంతో పులి షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ని కలిసాడు. పులి అయ్యాక గ్యాప్ తీసుకోవాలని ఉంది.

ఓ రెండేళ్లు పోయాక చేద్దాంలే అన్నాడట. అయితే అంతవరకూ ఆగే తత్త్వం లేని పూరి ఎవరితో చేయాలా అని ఆలోచిస్తుంటే, గోపీచంద్ గుర్తొచ్చాడు. లక్ష్యం లాంటి సినిమాల్లో అదరగొట్టేసిన గోపీచంద్ దీనికి కరెక్ట్ గా సూటవుతాడని పూరి ఓ నిర్ణయానికి వచ్చేసాడు. ఇక గోపీచంద్ ఆనందానికి అవధుల్లేవ్. హీరోయిన్ గా ఈ మూవీకి హన్సిక ను ఖరారు చేసారు.

అయితే చిన్న గొడవ రావడంతో ప్రియమణిని ఫిక్స్ చేసారు..2009 డిసెంబర్ 21న షూటింగ్ ప్రారంభమైంది. ఇక అదేసమయంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూకట్ పల్లిలో ఉద్యమకారులు అడ్డగించడంతో షూటింగ్ నిలిచిపోయింది. పోలీసులు కూడా చేరుకొని షూటింగ్ ఆపేయించారు. హైదరాబాద్, బ్యాంకాంక్ ,చెన్నైలలో షూటింగ్ జరిగింది.

2010 మే15న ఆడియో రిలీజ్ అయింది. మే27న భారీగా రిలీజైన ఈ సినిమా బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. గోపీచంద్ యాక్టింగ్,యాటిట్యూడ్ సినిమాకు బలం. పూరి టేకింగ్ మరో ఎసెట్. మూడు పాటలు హిట్ భాస్కరభట్ల రాసిన మగాళ్లు వట్టి మాయగాళ్లే సాంగ్ సూపర్ హిట్. ఈ పాత పాడిన గీతా మధురికి బెస్ట్ ఫిమేల్ సింగర్ గా ఫిలిం ఫేర్ అవార్డు వరించింది. చక్రి సంగీతం సూపర్భ్.