MoviesTollywood news in telugu

Chiranjeevi ఖైదీ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు..ఎన్ని కోట్ల లాభమో…?

Chiranjeevi khaidi movie : మెగాస్టార్ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉంది. చిరంజీవి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. చిరంజీవి నటించిన Khaidi సినిమా విశేషాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఇది. అప్పటికే చాలా సినిమాల్లో నటించి,100రోజుల వేడుకలు జరిగినా.. 62మూవీగా వచ్చిన ఖైదీ మాత్రం తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది.

ఈ సినిమా విజయంతో ఎస్ ఎస్ రవిచంద్ర డైరెక్షన్ లో జితేంద్ర , మాధవి జంటగా1984లో పద్మాలయ బ్యానర్ లో ఖైదీ పేరుతొ తీశారు. అలాగే కన్నడ లో ఖైదీ పేరుతొ తీశారు. నెల్లూరుకు చెందిన డాక్టర్ ఎం. తిరుపతి రెడ్డి సినిమాలకు ఫైనాన్స్ చేస్తూ ఓ సినిమా చేయాలనీ తన మిత్రులైన నరసారెడ్డి,సుధాకర రెడ్డి,ధనుంజయరెడ్డి తో సంప్రదించారు.

డైరెక్టర్ ఏ కోదండ రామిరెడ్డిని అప్రోచ్ అవ్వడంతో అప్పటికే చిరంజీవితో పలు సినిమాలు చేసిన నేపథ్యంలో చిరుతోనే మూవీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. చిరు ఒకే చేస్తూ డేట్స్ ఇచ్చాడు. వియత్నాం వీడు సుందరానికి కథ బాధ్యత అప్పగించారు. అయన రాసిన కథ చిరుకి నచ్చకపోవడంతో ఆఘమేఘాల మీద కథ రెడీ బాధ్యత పరుచూరి బ్రదర్స్ కి తిరుపతి రెడ్డి అప్పగించారు.

ఆరు గంటల్లో పరుచూరి వెంకటేశ్వరరావు కథ రెడీ. చిరుకి మైండ్ బ్లాంక్ అయింది. దాంతో మరో మూడు రోజుల్లో పరుచూరి గోపాలకృష్ణ మాటలు సిద్ధం చేసి ఇచ్చేసారు. హాలీవుడ్ మూవీ సిల్వర్ బ్లడ్ ప్రేరణతో రూపొందిన ఈ కథకు ఖైదీ అనే పేరు పెట్టారు. ఇక 1982జూన్ 16ఉదయం పావుగంట ముందు చిరు నెల్లూరు నుంచి ప్రసాద్ ల్యాబ్ కి చేరుకున్నారు.

చిరు,మాధవిలపై ముహూర్తపు షాట్ కి సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ ఇవ్వగా, కళ్యాణి ఫిలిమ్స్ ఎం సుధాకర రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేసారు. తొలిరోజే కాలేజీ సీన్స్, సాయంత్రం జైలు సీన్స్ తీశారు. ఇంటి నుంచి టీ షర్ట్ తెప్పించుకుని ,భుజాలు కట్ చేసేసి వేసుకుంటే చాలా బాగుందని షూటింగ్ చేసారు. ఇక సినిమా పూర్తయ్యేక ప్రివ్యూ చూసి మొదటి భాగం బాగున్నా, సెకండాఫ్ తేలిపోయిందన్న టాక్ వచ్చింది.

అయితే యూనిట్ కి మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది. సినిమా రిలీజ్ సమయంలో హోరున వర్షాలు కురుస్తున్నా సరే, జనం ఆదరించారు. అందుకే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 35ప్రింట్స్ తో విడుదలై 20సెంటర్స్ లో శతదినోత్సవం జరిగింది. వైజాగ్ సరస్వతి,విజయవాడ శైలజ,హైదరాబాద్ శాంతి,వరంగల్ జెమిని,తిరుపతి రామరాజ్ సెంటర్స్ లో డైరెక్ట్ 100రోజుల వేడుక జరిగింది.

విజయవాడలో 81రోజుల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ శాంతిలో ఉదయం ఆటతో సహా ఏడాది ఆడింది. మొదటి వారం34లక్షల గ్రాస్ తెచ్చింది. డాన్స్ లు,ఫైట్స్,నటన అన్నింటా చిరంజీవికి మంచి పేరు తెచ్చింది. సాంగ్స్,అన్నీ కుదిరిన పరిపూర్ణ సినిమాగా చిరు ఇప్పటికీ చెబుతారు. ఇక ఈ మూవీ తర్వాత చిరు,కోదండ రామిరెడ్డి కాంబోలో 17సినిమాలు వచ్చాయి.

ఈ సినిమా 100రోజుల వేడుక 1984ఫిబ్రవరి12న మద్రాసు మ్యూజిక్ అకాడెమీ హాలులో నిర్వహించారు. ఆంధ్రా బ్రూస్లీ మన చిరంజీవి అని అక్కినేని కితాబిచ్చారు. ఎన్టీఆర్ కి మూడు సార్లు దెబ్బలు తీగిలి సీఎం అయ్యారు. చిరు కూడా రెండు దెబ్బలు తిన్నందున ఇంకోటి తింటే సీఎం అవుతాడేమో అని కూడా అక్కినేని ప్రశంసించారు.

ఇక మల్లెమాల ఎం ఎస్ రెడ్డి అయితే 45నిమిషాల సేపు ప్రసంగించారు. 1983లో ఎన్టీఆర్ సీఎం అయితే,చిరంజీవి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు ఈ రెండు అద్భుత ఘటనలు అని నటీనటులకు మెమొంటోస్ ఇస్తూ దాసరి నారాయణరావు అన్నారు. సాంకేతిక నిపుణులకు ,ఎగ్జిబిటర్లకు జయసుధ మెమొంటోస్ ఇచ్చారు.