MoviesTollywood news in telugu

వెంకటేష్, బాలకృష్ణల మధ్య పోటీ గురించి మీకు తెలీని నమ్మలేని నిజాలు

Venkatesh And Balakrishna Movies : టాలీవుడ్ లో సినిమాల మధ్య పోటి అనేది సహజమే. తమ అభిమాన నటుల సినిమాలు విడుదల అయినప్పుడు ఆ నటుల అభిమానులు చాలా హడావిడి చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి ,బాలయ్య మధ్య జరిగిన పోటీ గురించి తెలిసినట్టుగా బాలయ్య, వెంకీల మధ్య పోటీని పెద్దగా గుర్తించలేకపోవచ్చు కానీ, మంచి పోటీయే సాగింది.

1997 ఆగస్టు 7న బాలకృష్ణ దేశోద్ధారకుడు రిలీజ్ అయింది. వారం తర్వాత వచ్చిన కలియుగ పాండవులు మూవీతో వెంకీ ఎంట్రీ ఇచ్చాడు. రెండు సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. 1987మే 8న వెంకీ అజేయుడు మూవీ, మే 14న బాలయ్య ప్రెసిడెంట్ గారబ్బాయి రిలీజ్ అయ్యాయి. రెండూ దెబ్బతిన్నాయి. అదే ఏడాది మే 19న బాలయ్య మువ్వగోపాలుడు రిలీజవ్వగా, ఘనవిజయం సాధించింది. 10రోజుల వ్యవధిలో వెంకటేష్ మూవీ భారతంలో అర్జునుడు రిలీజై పరాజయం పొందింది.

వెంకీ నటించిన రక్తతిలకం 1988 జనవరి 14వచ్చి, ఏవరేజ్ గా నిల్చింది. ఒకరోజు తేడాతో బాలయ్య మూవీ ఇనస్పెక్టర్ ప్రతాప్ రిలీజై, ఏవరేజ్ గానే ఉంది. ఇక 1989లో అనుకోకుండా ఒకే కథతో ఇద్దరి మూవీస్ రిలీజయ్యాయి. అశోక చక్రవర్తి, ధ్రువనక్షత్రం ఒకేరోజు వచ్చాయి. అప్పట్లో వివాదం కూడా రేపిన ఈ సినిమాలలో ధ్రువనక్షత్రం హిట్ అయింది.

1990లో వెంకీ అగ్గిరాముడు ప్లాపవ్వగా, వారం గ్యాప్ లో ఏప్రియల్ 25న బాలయ్య నటించిన నారీ నారీ నడుమ మురారి రిలీజై, హిట్ కొట్టింది. 1991జులై లో వెంకీ మూవీ కూలీ నెంబర్ 1 రిలీజై, ఘనవిజయం సాధించింది. ఆరు రోజుల గ్యాప్ లో జులై 18న బాలయ్య నటించిన ఆదిత్య 369 రిలీజై, సూపర్ హిట్ కొట్టింది. 1994లో బాలయ్య బొబ్బిలి సింహం సూపర్ హిట్ అయింది. వారం తేడాతో అక్టోబర్ 1న వచ్చిన వెంకీ ముద్దుల ప్రియుడు ప్లాప్.

1996లో బాలయ్య వంశానికొక్కడు, వెంకీ ధర్మచక్రం రిలీజై, సూపర్ హిట్ అయ్యాయి. అదే ఏడాది మే 19న బాలయ్య శ్రీకృష్ణార్జున యుద్ధం మూవీ ప్లాప్. మే 22న వెంకీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సూపర్ హిట్. 1997 జనవరిలో వెంకీ చిన్నబ్బాయి ప్లాప్. జనవరి 11న పెద్దన్నయ్య మూవీ సూపర్ హిట్. అదే ఏడాది అక్టోబర్ లో వెంకీ పెళ్లిచేసుకుందాం మూవీ సూపర్ హిట్. రెండు వారాల గ్యాప్ తో బాలయ్య దేవుడు మూవీ ప్లాప్.

2000సంక్రాంతికి బాలయ్య వంశోద్ధారకుడు, వెంకీ కలిసుందాం రా మూవీస్ రిలీజవ్వగా వెంకీ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 2001జనవరి 11న బాలయ్య నరసింహనాయుడుగా వచ్చి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. జనవరి 15న వచ్చిన వెంకీ దేవి పుత్రుడు నిరాశ మిగిల్చింది. 2019లో బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చి ప్లాప్. వెంకీ, వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 100కోట్ల గ్రాస్ తెచ్చింది. అదే ఏడాది డిసెంబర్ 13న వెంకటేష్, నాగ చైతన్య ల వెంకీ మామ మూవీ హిట్ కొట్టింది. అయితే బాలయ్య రూలర్ డిసెంబర్ 20న రిలీజై ప్లాప్ గా నిల్చింది.