kalyan ram ‘అతనొక్కడే’ మూవీ వెనుక తెలియని,నమ్మలేని సీక్రెట్స్…ఎన్ని కోట్ల లాభమో…?
Kalyan Ram Athanokkade Full Movie : నందమూరి హరికృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన Kalyan Ram చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ ని ,సరికొత్త బాణీలో చూపిస్తూ రిలీజైన అతనొక్కడే మూవీ… కళ్యాణ్ రామ్ కి స్టార్ స్టేటస్, డైరెక్టర్ సురేంద్ర రెడ్డికి స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చిన ఈ సినిమా 80సెంటర్స్ లో 50రోజులు, 40కేంద్రాల్లో 100రోజులు ఆడింది.
20కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అప్పటికే 9ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సురేంద్రరెడ్డి తొలిసినిమా కోసం ఓ కథ రెడీ చేసుకున్నాడు. డైరెక్టర్ సాగర్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ని కలిసాడు. సాగర్ శిష్యుడైన వివి వినాయక్ ఈ అపాయింట్ మెంట్ ఇప్పించాడు. కథ విన్నాక ప్రస్తుతం బిజీగా ఉన్నందున తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ని కలవాలని సూచించాడు.
అలా కళ్యాణ్ రామ్ దగ్గరకి సురేంద్ర రెడ్డి వెళ్ళాడు. అప్పటికే రెండు సినిమాలు చేసిన కళ్యాణ్ మూడో సినిమా కోసం చూస్తున్న సమయం అది. ఇక హరికృష్ణ కూడా ఈ సినిమా నువ్వు చేస్తే మంచి బ్రేక్ అవుతుందని చెప్పడంతో ఇలాంటి సినిమా సొంతంగా చేయాలనీ కళ్యాణ్ రామ్ నిర్ణయించాడు. అందుకే ఎన్టీఆర్,హరికృష్ణలతో చర్చించాక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించాడు.
అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా షూటింగ్ స్టార్ట్ చేసారు. ఇందులో చిన్న రోల్ కోసం ప్రకాష్ రాజ్ డేట్స్ ఎడ్జెస్ట్ మెంట్ కోసం తారక్ రిఫరెన్స్ తో ఇచ్చాడు. చంద్రబాబు, హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నాగార్జున, మోహన్ బాబు వంటి అతిరధ మహారధులంతా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియో,అల్యూమినియం ఫ్యాక్టరీ, రామానాయుడు విలేజ్, తదితర చోట్ల షూటింగ్ పూర్తిచేసుకుంది.
8కోట్ల బడ్జెట్ అయింది. 2005మే 7న 72ప్రింట్స్ తో విడుదలైంది. హీరో లుక్, హీరోయిన్ ఎంట్రీ, హీరోయిన్ చెప్పడంతో విలన్స్ ని హీరో చంపడం ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి. దాంతో 100సెంటర్స్ కి చేరింది. రివర్స్ స్క్రీన్ ప్లే ఫార్ములా క్లిక్ అవ్వడంతో ఆతర్వాత ఇదే ఫార్ములా చాలా సినిమాల్లో ఫాలో అయ్యారు. హిందీలో ఇంటర్ నేషనల్ డాన్ గా డబ్బింగ్ చేసారు. తమిళంలో విజయ్ హీరోగా ఆది పేరిట, కన్నడంలో లక్ష్మణ్ పేరిట రీమేక్ అయింది.

