Venkatesh ‘లక్ష్మి’ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?
Venkatesh Lakshmi Movie : రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాడు వెంకటేష్. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో డైరెక్టర్ వివి వినాయక్ అద్భుత విజయాన్ని లక్ష్మీ మూవీతో అందించాడు. నయనతార హీరోయిన్ గా చేసిన ఈ మూవీ కామెడీ,ఎమోషన్,ఫాక్షన్ నేపధ్యం ఇలా అన్నీ సమపాళ్లలో రంగరించి ఫుల్ కమర్షియల్ హంగులతో తీసిన ఈ మూవీ 2006 జనవరి 14న సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది.
రమణ గోగుల మంచి సాంగ్స్ అందించాడు.90సెంటర్స్ లో 100డేస్ ఆడిన ఈ సినిమా 24కోట్ల షేర్ తెచ్చింది. అదే రోజు సిద్ధార్ధ్ హీరోగా నటించిన చుక్కల్లో చంద్రుడు మూవీ రిలీజ్ యింది. అక్కినేని కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి చక్రి సంగీతం అందించాడు. సదా,సలోని,ఛార్మి హీరోయిన్స్. అయితే ఈ మూవీ ప్లాప్ గా నిల్చింది.
లక్ష్మీ మూవీకి రెండు రోజుల ముందు డాన్స్ కాన్సప్ట్ తో స్టైల్ మూవీ వచ్చింది. ప్రభుదేవా రాఘవ లారెన్స్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బాగానే నిల్చింది. మణిశర్మ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇదే రోజు కోకిల మూవీ కూడా వచ్చింది. శివ బాలాజీ,రాజీవ్ కనకాల,రాజా హీరోస్ గా నటించిన ఈ మూవీలో సలోని హీరోయిన్. కొండా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్లాప్ అయింది.
వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో రామ్,ఇలియానా టాలీవుడ్ కి హీరో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా దేవదాసు జనవరి 11న రిలీజయింది. చక్రి మ్యూజిక్ అదనపు ఆకర్షణ. 26సెంటర్స్ లో 100డేస్ ఆడిన ఈ మూవీ 14కోట్ల షేర్ తెచ్చి, బ్లాక్ బస్టర్ అయింది.
ఓ పక్క లక్ష్మీ, మరోపక్క దేవదాసు దూసుకుపోతుంటే, లక్ష్మీకి రెండు వారాల గ్యాప్ తో జనవరి 27న వచ్చిన హ్యాపీ మూవీ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించాడు. కరుణాకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్. ఈ మూవీ బిలో ఏవరేజ్ అయింది.
ఇదే రోజున శ్రీకాంత్ ,రాజేంద్ర ప్రసాద్ లు నటించిన సరదా సరదాగా మూవీ రిలీజయింది. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ గజిబిజిగా సాగుతుంది. బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించలేకపోయింది. అందుకే ప్లాప్ అయింది. ఇక రవిబాబు డైరెక్షన్ లో పార్టీ మూవీ జనవరి 27న వచ్చింది. అల్లరి నరేష్,బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ మూవీ ఏవరేజ్ అయింది.