ఇలా చేస్తే తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ క్షణాల్లో తగ్గి ప్రశాంతంగా ఉంటారు
Headache Home Remedies in Telugu : మనలో చాలామంది ఏదో ఒక సమయంలో తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. తలనొప్పి వచ్చిందంటే ఏ పని మీద దృష్టి పెట్టలేము. తలనొప్పి రావడానికి ఒత్తిడి, నిద్రలేమి, టెన్షన్ ఇలా అనేక రకాల కారణాలు ఉంటాయి. తలనొప్పి అనేది సమస్య చిన్నగా కనిపిస్తున్న దానిని అశ్రద్ధ చేస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

మనలో చాలామంది తలనొప్పి అనిపించగానే టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాల కోసం కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఎక్కువగా మందులను వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచన ప్రకారం మందులు వాడాలి.

అలా మందులు వాడుతూ ఈ చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. మన వంటింట్లో పసుపు, పాలు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాను చాలా సులువుగా ఫాలో అవ్వవచ్చు.

మనం రెగ్యులర్ గా వెల్లుల్లిని వంటలలో వాడుతూ ఉంటాం. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వెల్లుల్లి రసం వేసి బాగా కలిపి తాగాలి. ఈ విధంగా తాగడం వలన తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే అల్లం కూడా తలనొప్పి తగ్గించడానికి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే తలనొప్పి నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ రెమెడీలను ఫాలో అవటం వలన ఒత్తిడి, టెన్షన్ అన్ని తగ్గుతాయి. నిద్ర లేని సమస్య ఉన్నవారు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు అల్లం నీటిని లేదా వెల్లుల్లి నీటిని తాగటం వలన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

