Aswamedham (అశ్వమేధం) సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
Balakrishna And Sobhan babu Multistater Aswamedham Movie: తమ అభిమాన నటులు కలిసి నటిస్తే అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నటభూషణ్ శోభన్ బాబు, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అశ్వమేధం మూవీ సి అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ మూవీ 1992లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీల వలన దెబ్బతిందని టాక్. ఎందుకంటే రాయితీల వలన సినిమాల సంఖ్య పెరిగి, కథల్లో నాణ్యత తగ్గింది.
చర్చించుకోడానికి కూడా వీలులేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తద్వారా సినిమాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. అందులో అశ్వమేధం ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిలతో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ తీసి అద్భుత విజయాన్ని అందుకున్న తర్వాత అశ్వినీదత్ తీసిన సినిమా అశ్వమేధం. తన బ్యానర్ ప్రారంభించిన ఎన్టీఆర్ తో రెండు సినిమాలు తీసిన అశ్వినీదత్ తదుపరి సినిమా అశ్వమేధం ను ఎన్టీఆర్ తనయుడు బాలయ్యతో తీయాలని సంకల్పించారు.
బాలయ్య, శ్రీదేవి తొలి కాంబోలో తీయాలని భావించి రాఘవేంద్రరావు ని డైరెక్టర్ గా చేసారు. డేట్స్ తీసుకుని సినిమా లాంచ్ చేయాలని అనుకుంటే కుదరలేదు. అయినా పట్టువదలని విక్రమార్కునిలా 8నెలలు చర్చించి మరో కథ రెడీ చేయించారు. అలా రెడీ అయిన కథతో శోభన్ బాబు, బాలయ్యలతో అశ్వమేధం షూటింగ్ ని అశ్వినీదత్ ప్రారంభించారు.
1992జూన్ 29న నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇచ్చారు. దాంతో అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ స్టార్ట్ అయింది. పోలీసాఫీసర్ అభిమన్యుగా శోభన్ బాబు, అయన తమ్ముడు పైలెట్ ఆఫిసర్ గా బాలయ్య నటించారు. మీనా, నగ్మా హీరోయిన్స్. అమ్రిష్ పురి, రాధారవి, కోట శ్రీనివాసరావు విలన్లు. ముంబై నుంచి ప్రత్యేక టీమ్ రప్పించి ఇళయరాజా రీ రికార్డింగ్ చేసారు. 3కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 1992డిసెంబర్ 25న రిలీజయింది. మిశ్రమ స్పందన వచ్చిన ఈ మూవీ 8సెంటర్స్ లో 50రోజులు ఆడింది.