MoviesTollywood news in telugu

1981లో విడదల అయిన 98 సినిమాల్లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో ?

1981 Telugu Hit And Flop Movies : Tollywood ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సినిమాల గురించి సమాచారం తెలుసుకోవటానికి ప్రతి అభిమాని సిద్దంగా ఉంటాడు. అందులో 1981 తీసుకుంటే 98స్ట్రైట్ మూవీస్ వచ్చాయి. 26డబ్బింగ్ మూవీస్ వచ్చాయి. స్ట్రైట్ మూవీస్ లో ఎన్టీఆర్ 9, అక్కినేని 6, కృష్ణ 11, శోభన్ బాబు 10, కృష్ణంరాజు 7, చిరంజీవి 12మూవీస్ లో హీరోగా చేసారు.

ఇందులో ప్రేమాభిషేకం, కొండవీటి సింహం బ్లాక్ బస్టర్ కొట్టాయి. శ్రీవారి ముచ్చట్లు, ఊరికి మొనగాడు, పండంటి జీవితం, ఇల్లాలు, ఆకలిరాజ్యం, ఎర్రమల్లెలు, చట్టానికి కళ్లులేవు, న్యాయం కావాలి, సీతాకోక చిలుక , ముద్దమందారం, రాధాకళ్యాణం, సప్తపది, మూవీస్ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక గజదొంగ, కిరాయిరౌడీలు, దీపారాధన, పాలు నీళ్లు, పులిబిడ్డ, రహస్య గూఢచారి, రగిలే జ్వాలా, వారాలబ్బాయి, రాణికాసుల రంగమ్మ, సత్యభామ, భోగిమంటలు, గడసరి అత్త సొగసరి కోడలు, గురు శిష్యులు, మాయదారి అల్లుడు, సత్యం శివమ్, నాయుడుగారబ్బాయి, ప్రేమ కానుక, అగ్గిరవ్వ, పక్కింటి అమ్మాయి, డబ్బు డబ్బు డబ్బు , అద్దాల మేడ హిట్స్ అయ్యాయి.

జీవిత రధం, భోగభాగ్యాలు, అంతంకాదిది ఆరంభం, జతగాడు, ప్రేమ మందిరం, 47రోజులు, అత్తగారి పెత్తనం, ఊరికిచ్చిన మాట, గోల నాగమ్మ, తొలికోడి కూసింది, పల్లె పిలిచింది మూవీ ఏవరేజ్. మొత్తం మీద 14సూపర్ హిట్స్, 22హిట్స్, 11ఏవరేజ్, 51సినిమాలు బిలో ఏవరేజ్, ప్లాప్ అయ్యాయి. ప్రేమాభిషేకంతో బ్లాక్ బస్టర్ తో కల్సి నాలుగు హిట్స్ కొట్టి హీరో ఆఫ్ ది ఇయర్ గా అక్కినేని నిలిచాడు.

ఇక శ్రీదేవి 12సినిమాల్లో నటించి 8హిట్స్ తో హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ అయింది. ప్రేమాభిషేకం 29సెంటర్స్ లో 100డేస్ ఆడింది. 3సెంటర్స్ లో 300రోజులు ఆడింది. ఎన్టీఆర్ నటించిన కొండవీటి సింహం 31సెంటర్స్ లో 100రోజులు ఆడింది. 7కేంద్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ ఊరికి మొనగాడు 100డేస్ ఆడింది. శ్రీవారి ముచ్చట్లు 6సెంటర్స్ లో 100డేస్. శోభన్ బాబు ఇల్లాలు 6సెంటర్స్ లో, పండంటి జీవితం 5కేంద్రాల్లో 100రోజులు ఆడాయి.

చిరంజీవి నటించిన న్యాయం కావాలి 6సెంటర్స్ లో 100రోజులు ఆడింది. కృష్ణంరాజు పులిబిడ్డ 3సెంటర్స్ లో, కమలహాసన్ ఆకలిరాజ్యం 4కేంద్రాల్లో 100రోజులు నడిచాయి. ఎర్రమల్లెలు మూవీ విప్లవాన్ని రగిల్చింది. సీతాకోక చిలుక, సప్తపది క్లాసిక్ మూవీస్ గా మిగిలాయి.