Healthhealth tips in teluguKitchen

వారంలో 2 సార్లు మూత్రంలో మంట,ఒంట్లో వేడి క్షణాల్లో తగ్గి నీరసం,నిస్సత్తువ,అలసట అనేవి ఉండవు

Bottle gourd sweet in Telugu : మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు తగ్గాలంటే తప్పనిసరిగా కొన్ని ఆహారాలను తీసుకోవాలి. అనపకాయతో ఇలా తయారుచేసుకొని తీసుకుంటే మూత్రంలో మంట,ఒంట్లో వేడి క్షణాల్లో తగ్గి నీరసం,నిస్సత్తువ,అలసట అనేవి ఉండవు.
Bottle Gourd
అనపకాయను చెక్కులు తీసి తురమాలి.ఒక కప్పు ఆనపకాయ తురుము సిద్దం చేసుకోవాలి. ఆనపకాయ తురుమును నీటిలో వేసి బాగా కడిగి పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి బాదం పప్పు,జీడిపప్పు,గుమ్మడి గింజలు వేసి కాస్త వేగాక ఆనపకాయ తురుము వేసి వేగించాలి. తురుము పచ్చి వాసన పోయేవరకు వేగించాలి.

వేగిన తర్వాత మరిగిన అర లీటర్ పాలను పోసి బాగా కలపాలి. 5 నిమిషాలు అయ్యాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం 2 స్పూన్లు వేయాలి. ఆ తర్వాత 5 నిమిషాలు మరిగించాలి. ఒక స్పూన్ కస్టర్డ్ పొడర్ ని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పది నిమిషాలు ఉడికాక పావు స్పూన్ లో సగం యాలకుల పొడి కలపాలి.
jaggery Health benefits in telugu
చివరగా 3 స్పూన్ల బెల్లం పొడి వేసి కలపాలి. అంతే ఆనపకాయతో స్వీట్ రెడీ. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేసుకొని తింటే మూత్రంలో మంట,ఒంట్లో వేడి క్షణాల్లో తగ్గి నీరసం,నిస్సత్తువ,అలసట అనేవి ఉండవు. ముఖ్యంగా ఈ వేసవికాలంలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. మీరు చేసుకొని తిని సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.