MoviesTollywood news in telugu

Kaliyuga Pandavulu సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Venkatesh Kaliyuga Pandavulu Full Movie :మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు కుమారుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, సొంత టాలెంట్ తో విక్టరీ వెంకటేష్ గా ఎదిగి, ఇప్పటికీ హిట్ మూవీస్ తో దూసుకెళ్తు న్నాడు. రొటీన్ కి భిన్నమైన మూవీస్ ఎంచుకుని తనదైన పంధాలో వెళ్తున్నాడు. అయితే కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కలియుగ పాండవులు మూవీ ద్వారా వెంకీ ఎంట్రీ ఇచ్చాడు.

ఖుష్బూ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే, సురేష్ మూవీస్ బ్యానర్ లో తెలుగుతో సహా అన్ని భాషల్లో 50సినిమాలను అప్పటికి రామానాయుడు తీశారు. సూపర్ స్టార్ కృష్ణతో 51వ చిత్రంగా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో మూవీ కోసం పరుచూరి బ్రదర్స్ కి పురమాయించారు. ఐతే కురుక్షేత్రం సినిమాకు నిర్మాతగా భాగం పంచుకుంటున్న ఆర్ ఆంజనేయులుని భాగస్వామిగా పెట్టుకోవాలని కృష్ణ కోరడంతో రామానాయుడికి నచ్చలేదు.

దాంతో ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళింది. కృష్ణతో సినిమా అయ్యాక చిన్న కొడుకు వెంకటేష్ తో సినిమా తీయాలన్న రామానాయుడు సదరు సినిమా ఆగిపోవడంతో కొడుకుని అమెరికా నుంచి ఆఘమేఘాల మీద రప్పించారు. ప్రేమనగర్ లో చిన్నప్పటి సత్యనారాయణగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వెంకీ ఆ తర్వాత , హిందీ బందేశ్ మూవీలో కాలేజీ స్టూడెంట్ గా చిన్న పాత్ర చేసాడు.

ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఫ్రెండ్స్ తో కల్సి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, మోడలింగ్ కూడా సరదాగా చేసేవాడు. ఎనాడు హీరో అవ్వాలని అనుకోలేదు. కానీ రామానాయుడికి మాత్రం కొడుకుని హీరోగా చూడాలని ఉండేది. దాంతో ఇండియా రప్పించాక డైలాగ్ మాడ్యులేషన్ లో, నటనలో చాట్ల శ్రీరాములు, సదాశివరావు ల దగ్గర శిక్షణ ఇప్పించాడు. సుమతి కౌశల్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు.

ఇక డిసెంబర్ 13వెంకీ పుట్టినరోజు. అదే రోజు 1985లో వెంకీని హీరోగా చేస్తున్నట్లు ప్రెస్ మీట్ లో రామానాయుడు చెప్పేసారు. 1987లో అదే డేట్ లో పెళ్లి కావడం విశేషం. 1986లో హైదరాబాద్ లో వైభవంగా షూటింగ్ స్టార్ట్. కె ఎస్ ప్రకాశరావు క్లాప్ కొట్టారు. నూతన సంవత్సర ఆవిర్భావం నాడు మొదలై, స్వాతంత్ర్య దినోత్సవానికి ఓ రోజు ముందు రిలీజ్ అయింది. ఖుష్భుకి రోజా రమణి డబ్బింగ్ చెప్పారు. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ బందిపోటు నాయకుడిగా స్పెషల్ పాత్ర పోషించాడు.

రాధికా బ్రదర్ రాధారవి కూడా ఓ విలన్. మిక్కిలినేని, జెవి సోమయాజులు, రావుగోపాలరావు, చలపతిరావు, పీఎల్ నారాయణ, అశ్విని, రాళ్ళపల్లి, రమాప్రభ ఇలా ప్రముఖ తారలంతా ఇందులో నటించారు. అన్ని సినిమాల్లో చిన్న పాత్రలతో కనిపించే రామానాయుడు ఇక డాక్టర్ గా చిన్న పాత్రలో ఈ మూవీ లో కనిపిస్తారు.

సినిమా రిలీజ్ అయ్యాక గోదావరి జిల్లాల్లో తుపాన్ భీభత్సం సృష్టించినా, ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 1986డిసెంబర్ లో విజయవాడ సిద్ధార్ధ కాలేజీ గ్రౌండ్స్ లో వైభవంగా నిర్వహించారు. కృష్ణ చీఫ్ గెస్ట్. రాఘవేంద్రరావు హస్తవాసి కల్సి వచ్చి, వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అయ్యాడు.